Ravichandran Ashwin : అపజయం విజయానికి సోపానం
ఆర్ఆర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్
Ravichandran Ashwin : ఐపీఎల్ 2022లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రవిచంద్రన్ అశ్విన్. భారత జట్టు మాజీ కోచ్ ఇచ్చిన సలహాలు తను ఇంతగా ఎదిగేందుకు తోడ్పాటు అందించాయని తెలిపాడు.
భారత జట్టుకు ఆడాడు. పలు కీలక విజయాలలో పాలు పంచుకున్నాడు అశ్విన్. ఒక రకంగా చెప్పాలంటే అప్ డేట్ కాక పోతే ఆట ఆగి పోయినట్లేనని అంటాడు .
తన ఆట తీరును రోజు రోజుకు మరింత మెరుగు పర్చుకునేందుకు ప్రయత్నం చేస్తూనే వచ్చాడు రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin). 10 ఏళ్ల కిందట తన ఇంటర్నేషల్ క్రికెట్ ను ప్రారంభించాడు.
భారత జట్టుకు కీలకంగా మారాడు. 2011 ఐసీసీ వరల్డ్ ప్ , 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న టీమిండియాలో పాలు పంచుకున్నాడు.
అంతేకాదు2014 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు చేరిన జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin). త్వరలోనే టెస్టు జట్టులో అంతర్భాగంగా ఉన్నాడు. మ్యాచ్ విన్నర్ గా కూడా మారాడు.
టెస్టు క్రికెట్ లో కపిల్ దేవ్ రికార్డును అధిగమించాడు. ఈ ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత రెండో బౌలర్ గా నిలిచాడు. ఈ జర్నీలో నేను ఎన్నో తప్పులు చేశా.
ప్రధాన కోచ్ డంకన్ ఫ్లెచర్ ని కలిశా. ఎలా సక్సెస్ కావాలని అడిగా. ముందు విఫలమైతే గెలవడం ఎలాగో తెలుస్తందన్నాడు. ఆనాటి నుంచి నేను కీలకంగా మారానని చెప్పాడు అశ్విన్. ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ లో కీలకమైన ప్లేయర్ గా ఉన్నాడు.
Also Read : ఉత్కంఠ పోరులో ఎలిమినేటర్ ఎవరో