Farah Nathani : మహిళలు అన్ని రంగాలలో తమదైన ముద్ర కనబరుస్తూ సత్తా చాటుతున్నారు. 2017లో ఫరా నథానీ మెన్దీస్ కో ఫౌండర్ గా ది ముముమ్ కో కంపెనీకి కో ఫౌండర్ గా ఉన్నారు.
ఆమె నేతృత్వంలోని ఈ అంకుర సంస్థ ఊహించని రీతిలో దూసుకు వెళుతోంది. ప్రజలకు సరైన పోషక ఆహారం పొందేలా, ఆరోగ్య కరమైన జీవితాన్ని నిర్మించేందుకు ఈ స్టార్టప్ దోహద పడుతుంది.
ఫరా నథానీ (Farah Nathani )హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. పెన్సిల్వేనియా విశ్వ విద్యాలయంలో ఆమె చదువుకున్నారు. పిల్లలకు వంద శాతం సహజమైన, పోషకమైన ఆహారాలతో అందించడం ఈ స్టార్టప్ ముఖ్య లక్ష్యం.
ఈ కంపెనీలో సిద్దార్థ్ పరేఖ్ , నిసాబా గోద్రేజ్ , సుమీత్ నింద్రజోగ్ ఇందులో పెట్టుబడి పెట్టారు. ముంబై కేంద్రంగా ది ముముమ్ కో సంస్థ రూపు దిద్దుకుంది. పోషకాహార లోపం వల్ల దేశంలోని కోట్లాది మంది పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
వారికి సరైన సూచనలు, సలహాలు ఇచ్చే వారు కూడా కరువయ్యారు. వారి ఇబ్బందులను దూరం చేయాలనే సదుద్దేశంతో ఫరా నథానీ ఈ సంస్థను ఏర్పాటు చేసేలా చేసింది.
చిన్న పాటి ఆరోగ్యకరమైన ఆలోచన ఇప్పుడు లక్షలాది మంది పిల్లలకు మేలు చేకూర్చేలా చేయడం విశేషం కాక మరేమిటి. వ్యాపారం అంటే ఆదాయం గడించడం మాత్రమే కాదు దానికి ఒక సామాజిక ప్రయోజనం కూడా ఉండాలని ఆమె కోరుకుంది.
అందుకే స్టార్టప్ సంస్థను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సంస్థను నమ్మి ఎందరో సహాయ సహకారాలు అందజేస్తున్నారు.
Also Read : ఈ కామర్స్ లో నైకా సంచలనం