Brij Bhushan Singh : బ్రిజ్ భూషణ్ కు నార్కో టెస్ట్ చేయాలి
మహిళా రెజ్లర్లకు రైతులు మద్ధతు
Brij Bhushan Singh : తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ , భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(Brij Bhushan Singh) పై చర్యలు తీసుకోవాలని కోరుతూ దేశ రాజధానిలో మహిళా రెజర్లు నిరసన చేపట్టారు. గత ఏప్రిల్ 23 నుంచి ఆందోళన బాట పట్టారు. పలు పార్టీలు, వివిధ ప్రజా సంఘాలతో పాటు సంయుక్త కిసాన్ మోర్చా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. భారీ ఎత్తున రైతులు ఢిల్లీకి తరలి వచ్చారు.
మహిళా మల్ల యోధులను ఇబ్బందులకు గురి చేసిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రైతన్నలు. వచ్చే ఆదివారం కొత్త పార్లమెంట్ హౌస్ లో మహిళా పంచాయత్ లేదా మహిళా మండలి నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. హర్యానా లోని మెహమ్ లోరైతులు సర్వ్ ఖాప్ పంచాయతీ నిర్వహించారు. వందలాది మంది రైతులు పాల్గొన్నారు. మహా పంచాయతీ చేపట్టారు.
పంచాయతీలు , రైతు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు ఈ సమావేశంలో. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదన్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు రైతులు. వీరంతా హర్యానా లోని మెహమ్ పట్టణంలో గుమిగూడారు. నార్కో టెస్ట్ తప్పక చేయించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతన్నలు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఇండియా గేట్ వద్ద క్యాండిల్ మార్చ్ చేపట్టనున్నట్లు ప్రకటించారు.
Also Read : Akhilesh Yadav