Fatwa Ruby Asif Khan : ఫత్వాకు అదరను బెదరను – ఆసిఫా ఖాన్
గణేశుడి విగ్రహం ఏర్పాటుపై కామెంట్
Fatwa Ruby Asif Khan : తన నివాసంలో గణేష్ విగ్రహాన్ని పూజించినందుకు అలీఘర్ కు చెందిన రూబీ ఆసిఫ్ ఖాన్ పై ఫత్వా జారీ చేశారు. ముస్లింకు చెందిన బీజేపీ నాయకురాలిగా ఉన్నారు. ఇది తనకు కొత్తేమీ కాదన్నారు.
ఎలాంటి బెదిరింపులు, జారీ చేసే ఫత్వాలకు భయపడనని పేర్కొన్నారు. రామాలయానికి శంకుస్థాపన చేసిన తర్వాత ఆమె తన నివాసంలో పూజలు చేశారు.
వారంతా నాకు వ్యతిరేకంగా నిలబడ్డారు. ఇప్పుడు ఈ వ్యక్తులు నన్ను చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. నాకు బెదిరింపులు కూడా వస్తున్నాయని, కానీ వాటికి తాను భయపడబోనంటూ స్పష్టం చేశారు రూబీ ఆసిఫ్ ఖాన్(Fatwa Ruby Asif Khan).
నేను వినాయకుడిని నిమిజ్జనం చేస్తాను. నా భర్త కూడా తనతో ఉన్నాడని, తనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. నివేదికల ప్రకారం దేవబంద్ ముఫ్తీ అర్షద్ ఫరూఖీ ఈ చర్య ఇస్లాంకు విరుద్దమంటూ ఫత్వా జారీ చేశారు.
ఇస్లాంలో కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తారు. ఇస్లాం మతానికి విరుద్దంగా వ్యవహరించే వారి పట్ల ఇలాంటివి జారీ చేయడం షరా మూమాలేనని పేర్కొనడం కలకలం రేపింది.
విగ్రహాన్ని పూజించే వారిపై కూడా జారీ చేయబడుతుందన్నారు. అంతకు ముందు అలీగఢ్ లోని ఏడీఏ కాలనీకి చెందిన రూబీ ఖాన్ తన కుటుంబం అన్ని పండుగలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
అందుకే ఈసారి వినాయక చవితి(Ganesh Festival) సందర్భంగా తాను విగ్రహాన్ని తీసుకు వచ్చానని చెప్పారు రూబీ ఆసిఫ్ ఖాన్. తన కుటుంబ సభ్యులు ఎవరూ తనను వ్యతిరేకించ లేదన్నారు.
Also Read : మిస్త్రీ మరణంపై మహీంద్రా కామెంట్స్