Arif Mohammad Khan : ఫ‌త్వాల‌కు ఇస్లాంలో స్థానం లేదు

ఆరిఫ్ అహ్మ‌ద్ ఖాన్ షాకింగ్ కామెంట్స్

Arif Mohammad Khan : కేర‌ళ గ‌వ‌ర్న‌ర్ ఆరిఫ్ అహ్మ‌ద్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఫ‌త్వాలు ప‌దే ప‌దే జారీ చేయ‌డాన్ని ప్ర‌స్తావించారు. అంతే కాదు ఇస్లాం మ‌తంలో ఫ‌త్వాలకు స్థానం లేద‌ని పేర్కొన్నారు గ‌వ‌ర్న‌ర్. దేశంలో ఫ‌త్వాల‌ను రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం వాడుకుంటున్నారంటూ ఆరోపించారు.

ఖురాన్ లో డ‌జన్ల కొద్దీ సంద‌ర్భాలు ఉన్నాయ‌ని ఆరిఫ్ అహ్మ‌ద్ ఖాన్(Arif Mohammad Khan)  స్ప‌ష్టం చేశారు. ప్ర‌వ‌క్త సృష్టిక‌ర్త మాత్ర‌మే. త‌ప్పు ఒప్పుల‌ను నిర్ణ‌యించ గ‌ల‌డ‌ని పేర్కొన్నారు. ఢిల్లీలో రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ అనుబంధ వార ప‌త్రిక పాంచ‌జ‌న్య నిర్వ‌హించిన స‌మావేశంలో కేర‌ళ గ‌వ‌ర్న‌ర్ ఆరిఫ్ అహ్మ‌ద్ ఖాన్ పాల్గొని ప్ర‌సంగించారు.

తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్న‌ప్ప‌టి నుంచి త‌న‌పై ఫ‌త్వాలు ఉన్నాయ‌ని చెప్పారు. ఫ‌త్వాలు వాస్త‌వానికి రాజకీయ ఆయుధాలుగా ఉప‌యోగించు కునేందుకు మాత్ర‌మే ఉప‌యోగ ప‌డ్డాయ‌ని ఆరోపించారు కేర‌ళ గ‌వ‌ర్న‌ర్. ఇస్లాం మ‌తంలో మ‌తాధికారులు ఫ‌త్వాల‌ను జారీ చేస్తార‌ని, పాల‌కులు వీటిని సృష్టించార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అన్ని స‌మాజాల‌లో ఎప్పుడూ రెండు అభిప్రాయాలు ఉంటాయి. కానీ అధికారం ఉన్న వారు త‌మ సొంత ఆలోచ‌న‌ల‌ను ప్ర‌చారం చేస్తార‌ని చెప్పారు ఆరిఫ్ అహ్మ‌ద్ ఖాన్. మ‌తాధికారుల‌ను పాల‌కులు సృష్టించార‌ని , త‌ద్వారా వారి నిర్ణ‌యాల‌కు మ‌త ప‌ర‌మైన చ‌ట్ట‌బ‌ద్ద‌త ల‌భిస్తుంద‌ని అన్నారు గ‌వ‌ర్న‌ర్. ప్ర‌వ‌క్త మ‌ర‌ణించిన‌ప్ప‌టి నుండి ఇస్లాం మ‌తాన్ని రాజ‌కీయాలు ఆక్ర‌మించాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

త‌న‌కు వ్య‌తిరేకంగా ఫ‌త్వాలు జారీ అయిన‌ప్పుడు తాను బీజేపీలో భాగం కాదని గ‌వ‌ర్న‌ర్ అన్నారు. తాను హిందీలో మాట్లాడినా ఫ‌త్వాలు జారీ చేసిన దాఖ‌లాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు గ‌వ‌ర్న‌ర్.

Also Read : కేంద్ర మంత్రి అశ్విని కారు బోల్తా

Leave A Reply

Your Email Id will not be published!