FEFSI Rules : ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కొత్త రూల్స్
తమిళ సినిమాలకు తమిళులనే నియమించాలి
FEFSI Rules : ప్రాంతీయ అభిమానం తారా స్థాయికి చేరింది. తమ ప్రాంతపు కళాకారులకు అవకాశాలు దక్కడం లేదన్న ఆందోళన సినిమా రంగానికి చెందిన నటీ నటులు, సాంకేతిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. దీంతో భారీ ఎత్తున సినిమాలు రూపొందుతున్నాయి. కాగా సరికొత్త రూల్స్ ప్రతిపాదించింది తాజాగా ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (FEFSI).
FEFSI Rules Tamil
రూల్స్ లలో భాగంగా తమిళ చిత్రాలకు తమిళ రంగానికి చెందిన కళాకారులను మాత్రమే నియమించాలని స్పష్టం చేసింది. సినిమాల షూటింగ్స్ కేవలం తమిళనాడులో జరగాలని పేర్కొంది. వేరే చోట నిర్వహించ కూడదని పేర్కొంది. షూట్ అవసరం లేకుండా బయట రాష్ట్రంలో లేదా బయట దేశంలో జరగ కూడదని వెల్లడించింది.
షూటింగ్ సకాలంలో పూర్తి కాక పోయినా లేదా బడ్జెట్ అయి పోయినా , ఇందుకు సంబంధించి తగిన కారణాలతో నిర్మాతలకు రాత పూర్వకంగా తెలియ చేయాలని పిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది.
ఈ రూల్స్ ను ఎవరు అతిక్రమించినా లేదా ఉల్లంఘనకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఫెఫ్సీ కుండ బద్దలు కొట్టింది. అంతే కాకుండా భారీ జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది.
Also Read : Prabhas Flying : నింగిలో ప్రభాస్ పోస్టర్ రెపరెపలు