FIFA World Rankings 2022 : ప్రపంచ ర్యాంకింగ్స్ లో మెస్సీ సేన
నెంబర్ వన్ బ్రెజిల్ నెంబర్ 2 అర్జెంటీనా
FIFA World Rankings 2022 : ఫిఫా వరల్డ్ కప్ ముగిసింది. వరల్డ్ వైడ్ ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. వరల్డ్ లో మోస్ట్ పాపులర్ ఫుట్ బాలర్ గా పేరొందిన అర్జెంటీనా స్కిప్పర్ లియోనెల్ మెస్సీ సారథ్యంలో ఆ జట్టు మెస్మరైజ్ చేసింది. ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ను ఎగరేసుకు పోయింది. ఫైనల్ లో పెనాల్టీ షూటౌట్ లో 4 – 2 తేడాతో మెబాప్పే నేతృత్వంలోని ఫ్రాన్స్ జట్టును మట్టి కరిపించింది.
ఇందుకు గాను మెస్సీ సేనకు ఏకంగా రూ. 347 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా మెస్సీ కోసం గూగుల్ ను సెర్చ్ చేశారంటూ టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ వెల్లడించాడు. ఇదిలా ఉండగా ఈ అద్భుత విజయం దక్కడంతో తాజాగా ప్రకటించిన ఫిఫా వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఏకంగా రెండో స్థానానికి చేరుకుంది అర్జెంటీనా.
కాగా ప్రపంచ కప్ ను చేజిక్కించుకున్నా నెంబర్ వన్ దక్కించుకోలేక పోయింది. ఇది అందరినీ ప్రత్యేకించి ఫుట్ బాల్ ప్రేమికులను విస్తు పోయేలా చేసింది. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ లో(FIFA World Rankings 2022) బ్రెజిల్ టాప్ లో నిలిచింది. ఆ జట్టుకు 1840 పాయింట్లు దక్కాయి. నెంబర్ వన్ గా నిలిచింది.
ఇక రెండవ స్థానంతోనే సరి పెట్టుకోవాల్సి వచ్చింది అర్జెంటీనా. కేవలం 2 పాయింట్ల దూరంలో మొదటి ప్లేస్ కోల్పోయింది. మెస్సీ సేనకు 1838 పాయింట్లు లభించాయి. ఇక 1823 పాయింట్లతో ఫ్రాన్స్ మూడో స్థానంతో సరి పెట్టుకుంది. ఈ జట్టు వరల్డ్ కప్ ఫైనల్ లో రన్నరప్ గా నిలిచింది.
తర్వాతి స్థానాలను 1781 పాయింట్లతో బెల్జియం, 1774 పాయింట్లతో ఇంగ్లండ్ , 1740 పాయింట్లతో నెదర్లాండ్స్ నిలిచాయి. ఎవరూ ఊహించని రీతిలో క్రొయేషియా 1727 పాయింట్లు సాధించి ఏడో స్థానంలోకి చేరింది. ఇక ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్ వరుసగా 8,9,10 స్థానాలతో సరి పెట్టుకున్నాయి.
Also Read : 227 పరుగులకే బంగ్లా ఆలౌట్