Krishna Tribute : సినీ దిగ్గజానికి సంతాపాల వెల్లువ
దివికేగిన నట శేఖరుడు కృష్ణ
Krishna Tribute : సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరన్న వార్త యావత్ సినీ లోకం శోకసంద్రంలో మునిగి పోయింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. గొప్ప స్నేహుతిడిని కోల్పోయానని పేర్కొన్నారు. సినీ రంగం గొప్ప లెజెండ్ ను కోల్పోయిందన్నారు మాజీ సీఎం , టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు.
తెలుగు రాష్ట్రాలలో అత్యధిక అభిమాన సంఘాలు కలిగిన ఏకైక నటుడు అని కొనియాడారు. తాను చిన్నతనంలో కృష్ణ నటించిన తేనె మనసులు చూశానన్నారు. కృష్ణ(Krishna Tribute) భౌతిక కాయాన్ని చూసి ప్రముఖ నటుడు మోహన్ బాబు కన్నీటి పర్యంతం అయ్యారు. తనను కష్ట సమయంలో ఆదుకున్నారంటూ వాపోయారు.
ఆయనతో కలిసి 70 సినిమాలలో నటించానని చెప్పారు. నట శేఖరుడు కృష్ణ తనకు ఫేవరేట్ హీరో అని కొనియాడారు నాగేంద్రబాబు. రెండు రాష్ట్రాలకు తీరని లోటు అని అన్నారు. కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు అల్లు అర్జున్ , ఎన్టీఆర్ , నాగ చైతన్య, కీరవాణి, బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ శ్రీనివాస్ . ఒక తరం ముగిసిందన్నారు త్రివిక్రమ్ .
రాఘవేంద్ర రావును పట్టుకుని బోరున విలపించారు నటుడు మహేష్ బాబు. కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. కృష్ణ మరణ వార్తతో సినీ లోకం మూగ బోయిందన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
తనకు అత్యంత ఆత్మీయుడని కన్నీటి పర్యంతం అయ్యారు దర్శకుడు రాఘవేంద్రరావు. మంచి తనానికి మారు పేరంటూ పేర్కొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ అంతిమ సంస్కారాలు రేపు జరగనున్నాయి. దీంతో చలనచిత్ర పరిశ్రమకు సెలవు ప్రకటించింది నిర్మాతల మండలి.
Also Read : ఎస్పీబీని ప్రోత్సహించిన సూపర్ స్టార్