5G Spectrum Auction : మొదటి రోజు రూ. 1.45 లక్షల కోట్లు
రెండో రోజూ కొనసాగనున్న వేలం పాట
5G Spectrum Auction : దేశ వ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలను గంప గుత్తగా అమ్మకానికి పెట్టిన కేంద్రం ఇప్పుడు జీవితంలో నిత్య భాగంగా మారి పోయిన టెక్నాలజీ పై ఫోకస్ పెట్టింది. ఇందుకు సంబంధించి 5జీ వేలం పాట(5G Spectrum Auction) ద్వారా రూ. 4.5 లక్షల కోట్లు రాబట్టాలని అంచనా వేసింది.
ఇందులో ఊహించని రీతిలో దిగ్గజ కంపెనీలు ఎంట్రీ ఇవ్వడంతో బిడ్ మరింత ఆసక్తికరంగా మారింది. మొదటి రోజు జూలై 26న ముగిసింది. ఇందుకు సంబంధించి వేలం పాటలో రూ. 1.45 లక్షల కోట్ల దాకా వచ్చి ఆగింది.
ఇక స్పెక్ట్రమ్ రెండో రోజు వేల పాట ఇవాళ ప్రారంభమైంది. రూ. 4.3 లక్షల కోట్ల విలువైన 72 గిగా హెర్ట్స్ 5జీ ఎయిర్ వేవ్ ల కోసం భారత దేశ ప్రభుత్వం అతి పెద్ద బిడ్ చేపట్టింది. నాలుగు రౌండ్ లు ముగిశాయి.
ఇందులో అదానీ గ్రూప్ కు చెందిన గౌతం అదానీ, రిలయన్స్ గ్రూప్ తరపున ముఖేష్ అంబానీ, ఎయిర్ టెల్ కి చెందిన నవీన్ మిట్టల్ తో పాటు వొడా ఫోన్ ఐడియా సంస్థ కూడా బిడ్ లో పాల్గొన్నాయి.
ప్రస్తుతం 4జి మాత్రమే దేశంలో అందుబాటులో ఉంది. ఒక వేళ 5జీ గనుక అందుబాటులో వస్తే ఇంటర్నెట్ వేగం మరింత పెరుగుతుంది. దీని వల్ల సంస్థలకు అదనపు ప్రయోజనం కలుగుతుంది.
రోజూ వారీ వ్యవహారాలు సులభతరం అవుతాయి. నెట్ కనెక్టివిటీ పెరుగుతుంది. వ్యాపారాలను విస్తరించేందుకు వీలు కలుగుతుంది. 26న జరిగిన 5జీ స్పెక్ట్రమ్ వేలం పాట ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల దాకా కొనసాగింది.
27న కూడా సాయంత్రం దాకా కొనసాగనుంది. మొదటి రోజు అంబానీ, మిట్టల్ , అదానీ , ఐడియా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారని టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Also Read : స్వతంత్ర జర్నలిజం ప్రజాస్వామ్యానికి ప్రాణం