Congress Loss : ఐదు నెలల్లో ఐదుగురు సీనియర్లు గుడ్ బై
కాంగ్రెస్ ను వీడిన దిగ్గజ నేతలు
Congress Loss : భారతదేశంలో 134 ఏళ్ల సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఆ పార్టీని వీడుతున్న వాళ్లు ఎక్కువై పోయారు.
గతంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నాయకులంతా పార్టీలో ఇముడ లేక పోతున్నారు. తాజాగా అసమ్మతి నాయకుడిగా పేరొందిన , ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ బుధవారం గుడ్ బై చెప్పారు పార్టీకి.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీలో గత ఐదు నెలల కాలంలో ఐదుగురు ప్రముఖులు ఆ పార్టీని వీడారు. వారంతా వివిధ కారణాలతో తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీకి గుడ్ బై చెప్పిన నాయకులలో కపిల్ సిబల్ వెరీ వెరీ స్పెషల్.
ఆయన గాంధీ ఫ్యామిలీ నాయకత్వాన్ని నిరసించారు. ఆపై పార్టీలో సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
జీ23 ఏర్పాటులో కీలకంగా ఉన్నారు.
చివరి దాకా ఆయన పార్టీపై ధిక్కార స్వరం వినిపించారు. 2024లో దేశంలో పవర్ లోకి రావాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో ఒక్కరొక్కరు చాప చుట్టేయడంతో జీర్ణించు కోలేక పోతోంది.
ఉదయ్ పూర్ లో చింతన్ శివిర్ పై కపిల్ సిబల్ ఎద్దేవా చేశారు.పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ సునీల్ జాఖర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీని(Congress Loss) వీడారు. భారతీయ జనతా పార్టీలో చేరారు.
ఆ పార్టీకి పెద్ద కుదుపు. గుజరాత్ లో బలమైన పాటిదార్ కమ్యూనిటీకి చెందిన నాయకుడు. ఆయన పార్టీ ప్రజలను ఏనాడో విస్మరించిందంటూ
రాజీనామా చేశారు.
ఆ రాష్ట్రంలో బలమైన నేతగా పేరుంది. రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. నేల విడిచి సాము చేస్తున్నారంటూ ఆరోపించారు. అంతకు
ముందు మాజీ కేంద్ర న్యాయ శాఖ మంత్రి , నాలుగు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీని(Congress Loss) వీడుతున్నట్లు ప్రకటించారు.
భవిష్యత్తులో కాంగ్రెస్ పతనాన్ని తాను కళ్లారా చూస్తానని సంచలన కామెంట్ చేశాడు. మాజీ కేంద్ర మంత్రిగా పని చేసిన ఆర్పీ ఎన్ సింగ్
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరారు. మొత్తంగా రాబోయే కాలంలో ఇంకెంత మంది వీడనున్నారో తేలనుంది.
Also Read : తప్పు చేసినట్టు నిరూపిస్తే ఉరి శిక్షకు సిద్ధం