Shimron Hetmyer : ఫ్లైట్ మిస్ షిమ్రోన్ హెట్మెయ‌ర్ అవుట్

షిమ్రోన్ స్థానంలో ష‌మ‌ర్ బ్రూక్స్ ఎంపిక

Shimron Hetmyer : వెస్టిండీస్ జ‌ట్టులో కీల‌క‌మైన ఆట‌గాడిగా పేరొందాడు షిమ్రోన్ హిట్మెయ‌ర్(Shimron Hetmyer). అక్టోబ‌ర్ 16 నుంచి ఆస్ట్రేలియాలో టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా అన్ని దేశాల జ‌ట్లు త‌మ తుది టీమ్ ల‌ను ప్ర‌క‌టించాయి. తాజాగా విండీస్ స్టార్ హిట్ట‌ర్ గా పేరొందిన షిమ్రోన్ హిట్మెయ‌ర్ ను ఎంపిక చేసిన సెలెక్ష‌న్ క‌మిటీ.

ఈ మేర‌కు జ‌ట్టుతో పాటు ఆసిస్ కు వెళ్లాల్సి ఉంది. ఇదిలా ఉండ‌గా నిర్దేశించిన స‌మ‌యానికి కంటే ముందుగా విమానం వెళ్లి పోవ‌డంతో ఎక్క‌లేక పోయాడు. దీంతో జ‌ట్టు ప‌రంగా ఆడ‌తాడా లేదా అన్న‌ది అనుమానంగా ఉంది. షిమ్రాన్ హెట్మెయ‌ర్ త‌న రీ షెడ్యూల్డ్ ఫ్లైట్ నుండి ఆస్ట్రేలియాకు వెళ్ల లేక పోయాడు.

ఫ్లైట్ మిస్సింగ్ త‌ర్వాత షిమ్రాన్ టి20 వ‌ర‌ల్డ్ కప్ కోసం విండీస్ జ‌ట్టు నుండి నిష్క్ర‌మించాడు. ఆస్ట్రేలియాలో జ‌ర‌గ‌నున్న ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం విండీస్ జ‌ట్టులో హెట్మెయ‌ర్ స్థానంలో ష‌మ‌ర్ బ్రూక్స్ ను ఎంపిక చేసిన‌ట్లు క్రికెట్ విండీ్ బోర్డు (సీడ‌బ్ల్యూఐ) మంగ‌ళ‌వారం అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి తెలియ చేసింది.

ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది విండీస్ బోర్డు. అక్టోబ‌ర్ 3న గ‌యానా నుండి బ‌య‌లు దేరేందుకు సీటు దొరికింది. దుర‌దృష్ట‌వ‌శాత్తు మెట్రికాన్ స్టేడియంలో అక్టోబ‌ర్ 5న ఆస్ట్రేలియాతో జ‌రిగే 1వ టి20 ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాచ్ ను కోల్పోతాడ‌ని పేర్కొంది.

న్యూయార్క్ కు వెళ్లే ఫ్లైట్ స‌మ‌యానికి తాను చేరుకోలేక పోతున్న‌ట్లు విండీస్ క్రికెట్ బోర్డు డైరెక్ట‌ర్ జిమ్మీ ఆడ‌మ్స్ కు తెలియ చేశాడు.

Also Read : వారెవ్వా డేవిడ్ మిల్ల‌ర్ కిల్ల‌ర్

Leave A Reply

Your Email Id will not be published!