Sharad Pawar : బీజేపీయేతర పార్టీల ఏకంపై ఫోకస్
పాలనను గాలికొదిలేసిన కేంద్రం
Sharad Pawar : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన కేంద్రంపై , ప్రధానమంత్రిపై మండిపడ్డారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
బీజేపీయేతర ప్రభుత్వాలను పడగొట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నాయంటూ ధ్వజమెత్తారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలను అన్నింటిని కూడగట్టి ఒకే తాటిపైకి తీసుకు వచ్చే ప్రయత్నం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
బీజేపీ చేస్తున్న కుటిల ప్రయత్నాలు ఏవీ సఫళీకృతం కావన్నారు పవార్. కాగా వయో భారం వల్ల తాను ఏ బాధ్యతను స్వీకరించే స్థితిలో లేరని పేర్కొన్నారు. దేశంలో రాచరిక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.
2014 నుంచి నేటి దాకా కొలువు తీరిన కేంద్ర ప్రభుత్వం తన ఎనిమిదేళ్ల పాలనలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చిన దాఖలాలు లేవన్నారు. ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్నారు.
నల్ల ధనం తీసుకు వస్తామని చెప్పారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ ఏ ఒక్కటి అమలు కాలేదని ధ్వజమెత్తారు పవార్. ప్రభుత్వ ఆస్తులను గంప గుత్తగా అమ్మడం రాకెట్ కంటే వేగంగా చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
మహారాష్ట్రలోని థానేలో శరద్ పవార్(Sharad Pawar) మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా చిన్న పార్టీలను ఎదగ నీయకుండా చేస్తున్నారని ఇది చెల్లదన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం దారుణమన్నారు.
ప్రతి ఇంటికి కరెంట్, టాయిలెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. గ్రామాలను ఇంటర్నెట్ తో అనుసంధానం చేస్తామన్నారు. గాలి కబుర్లు చెప్పారు. పాలనను గాలికి వదిలేశారంటూ ధ్వజమెత్తారు.
Also Read : ఢిల్లీలో అర్ధరాత్రి ఆప్..బీజేపీ హై డ్రామా