Pele Messi : ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ అద్భుతం – పీలే
మాజీ ఫుట్ బాల్ స్టార్ పీలే కామెంట్
Pele Messi : లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్ 2022 విజేతగా నిలిచింది. అరుదైన చరిత్ర సృష్టించింది. ఈ సందర్బంగా యావత్ ప్రపంచం మెస్సీకి జేజేలు పలుకుతోంది. మాజీ దిగ్గజ ఆటగాళ్లు సైతం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫుట్ బాల్ మాంత్రికుడిగా పేరొందిన పీలే ప్రశంసలతో ముంచెత్తాడు మెస్సీని.
లియోనెల్ ప్రపంచ కప్ గెలిచేందుకు అర్హుడని బ్రెజిలియన్ లెజెండ్ పేర్కొన్నారు. ఆదివారం జరిగిన ఫైనల్ లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్ లో ఫ్రాన్స్ ను ఓడించిన తర్వాత మెస్సీ ప్రపంచ విజేతకు అర్హుడని స్పష్టం చేశాడు పీలే. మెస్సీ గురించి ఎంత చెప్పినా తక్కువే(Pele Messi). ఎందుకంటే మెస్సీ అంటేనే ఓ ఉద్విగ్నం. ఓ అద్భుతం.
అతడు కదిలే ప్రపంచం అన్నాడు. ప్రశంసలతో ముంచెత్తాడు. ప్రతి ఆటగాడికి ఓ తీరని కోరిక ఉంటుంది. అదేమిటంటే ప్రపంచ కప్ ను గెలుచు కోవాలని, ఆ బంగారు క్షణాలను ఆస్వాదించాలని. అదే జరిగింది. దానిని నిజం చేశాడు లియోనెల్ మెస్సీ. ఇలాంటి అద్భుతాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించినందుకు నేను మెస్సీని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని పేర్కొన్నాడు పీలే.
ఇదిలా ఉండగా అదనపు సమయంలో 3-3తో ముగిసిన ఫైనల్ లో హ్యాట్రిక్ సాధించిన ఫ్రెంచ్ స్ట్రైకర్ కైలియన్ ఎంబాప్పేని కూడా పీలే ప్రశంసించాడు.
ఇదే సమయంలో నా ప్రియమైన స్నేహితుడు ఎంబాప్పే ఆట తీరు అద్భుతమని పేర్కొన్నాడు పీలే. అంతే కాకుండా సెమీ ఫైనల్ కు చేరిన మొదటి ఆఫ్రికన్ దేశంగా అవతరించినందుకు మొరాకోను అభినందించాడు.
ఈ సందర్భంగా మెస్సీ, మారడోనా లను గుర్తు చేసుకున్నాడు పీలే.
Also Read : ఎంబాప్పే హ్యాట్రిక్ వరల్డ్ కప్ లో రికార్డ్