Heath Streak : మాజీ క్రికెటర్ హీత్ స్ట్రీక్ కన్నుమూత
జింబాబ్వే క్రికెట్ లో తీరని విషాదం
Heath Streak : జింబాబ్వే క్రికెట్ లో విషాదం నెలకొంది. ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ప్రముఖ క్రికెటర్ హీత్ స్ట్రీక్ క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఆయన వయసు 49 ఏళ్లు. ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందాడు. తన దేశానికి ఎన్నో విజయాలను సాధించి పెట్టాడు.
Heath Streak No More
జింబాబ్వే తరపున 453 వికెట్లు సాధించాడు. హీత్ స్ట్రీక్ 1990 , 2000 ప్రారంభంలో జింబాబ్వే క్రికెట్ లో మోస్ట్ పాపులర్ క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. 65 టెస్టులు , 189 వన్డే మ్యాచ్ లు ఆడాడు. తన దేశం తరపున 4,933 రన్స్ చేశాడు.
2005లో హీత్ స్ట్రీక్(Heath Streak) క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం కోచింగ్ పాత్రలోకి మారారు. దేశీయ, అంతర్జాతీయ క్రికెట్ లోని వివిధ టీమ్ లను తీర్చిదిద్దాడు. బంగ్లాదేశ్ , జింబాబ్వేతో పాటు ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు కోచింగ్ ఇచ్చాడు హీత్ స్ట్రీక్.
ఐసీసీ అవినీతి నిరోధక కోడ్ ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఎనిమిదేళ్ల పాటు నిషేధానికి గురయ్యాడు. క్రికెట్ లెజెండ్ ను కోల్పోవడం బాధగా ఉందన్నాడు మాజీ క్రికెటర్ హెన్రీ ఒలోంగా. భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్ర సంతాపం తెలిపారు.
Also Read : Ayutha Chandi Yagam : చండీ యాగం కళ్యాణోత్సవం