Ravi Narain : ఎన్ఎస్ఈ మాజీ చీఫ్ ర‌వి నారాయణ్ అరెస్ట్

మ‌నీ లాండ‌రింగ్ కేసులో పాత్ర‌

Ravi Narain : మ‌నీ లాండ‌రింగ్ కేసులో నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్చేంజ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ , మేనేజింగ్ డైరెక్ట‌ర్ ర‌వి నారాయణ్(Ravi Narain) అరెస్ట్ అయ్యారు. పీఎంఎల్ఏ లోని క్రిమిన‌ల్ సెక్ష‌న్ల కింద ట్యాపింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న‌ట్లు స‌మాచారం.

స్కామ్ కేసు, ఉద్యోగుల అక్ర‌మ ఫోన్ ట్యాపింగ్ వంటి రెండు క్రిమిన‌ల్ కేసుల్లో భాగంగా ఆయ‌న పాత్ర‌ను ఫెడ‌ర‌ల్ ప్రోబ్ ఏజెన్సీ ద‌ర్యాప్తు చేస్తోంది.

ర‌వి నారాయ‌ణ్ ఏప్రిల్ 1994 నుండి మార్చి 31, 2013 వ‌ర‌కు నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్చేంజ్ కి మేనేజింగ్ డైరెక్ట‌ర్ , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ గా ఉన్నారు. ఏప్రిల్ 1 నుండి ఎన్ఎస్ఈ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో వైస్ చైర్మ‌న్ గా నియ‌మితుల‌య్యారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో మ‌రో మాజీ ఎన్ఎస్ఈ ఎండీ , సిఇఓ చిత్రా రామ‌కృష్ణ‌ను ఈడీ గ‌తంలో అరెస్ట్ చేసింది. ఈ కేసుల‌ను స‌మాంత‌రంగా విచారిస్తున్న సిబీఐ కో – లొకేష‌న్ కేసులో ఆమెను అరెస్ట్ చేసింది.

ఇదే క్ర‌మంలో అక్ర‌మ ఫోన్ ట్యాపింగ్ కేసులో ముంబై మాజీ పోలీస్ క‌మిష‌న‌ర్ సంజ‌య్ పాండేని జూలై 19న అరెస్ట్ చేసింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌.

పాండే , అత‌ని కుటుంబ స‌భ్యుల నేతృత్వంలోని కంపెనీ ద్వారా 1997 నుండి ఎన్ఎస్ఈలో ఫోన్ కాల్స్ స్నూపింగ్ జ‌రుగుతోంద‌ని సంస్థ గ‌తంలో కోర్టుకు తెలిపింది.

పాండే కంపెనీ ఐసెక్ స‌ర్వీసెస్ ఐ మే 19న న‌మోదైన సీబీఐ ఎఫ్ఐఆర్ ద్వారా అనేక ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు తేలింది. టెక్నాల‌జీ ప‌రంగా చోటు చేసుకున్న అడ్వాంటేజ్ ను ఆస‌రాగా చేసుకుని అక్ర‌మాల‌కు తెర లేపిన‌ట్లు గుర్తించింది ఈడీ.

Also Read : క‌ర్ణాట‌క మంత్రి ఉమేష్ క‌త్తి క‌న్నుమూత

Leave A Reply

Your Email Id will not be published!