KV Thomas : మాజీ మంత్రి కేవీ థామ‌స్ పై కాంగ్రెస్ వేటు

కేర‌ళ సీఎం పిన‌ర‌య్ విజ‌య‌న్ తో భేటీ ఫ‌లితం

KV Thomas  : కాంగ్రెస్ పార్టీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కేర‌ళ‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి కేవీ థామ‌స్(KV Thomas )ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించింది. ఈ మేర‌కు అధికారికంగా ప్ర‌క‌టించింది.

కొచ్చిలో జ‌రిగిన లెఫ్ట్ పార్టీ నేతృత్వంలోని ఫ్రంట్ ఉప ఎన్నిక స‌మావేశంలో సీపీఎం (ఎం ) నాయ‌కుడు, కేరళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ తో కేవీ థామ‌స్(KV Thomas )భేటీ అయ్యారు. ములాఖ‌త్ జ‌రిగిన కొద్ది సేప‌టికే కేవీ థామ‌స్ పై కాంగ్రెస్ పార్టీ చ‌ర్య తీసుకుంది.

గ‌త కొంత కాలం నుంచి పార్టీ నాయ‌క‌త్వంతో విభేదిస్తూ వ‌స్తున్నారు థామ‌స్. పార్టీ వ్య‌తిరేక కార్య‌కలాపాల‌కు పాల్ప‌డుతున్నార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.

ఈ మేర‌కు పార్టీ చీఫ్ సోనియా గాంధీ ఆదేశాల మేర‌కు కాంగ్రెస్ తిరుగుబాటు నేత‌, కేంద్ర మాజీ మంత్రి కేవీ థామ‌స్ ను బ‌హిష్క‌రించిన‌ట్లు కేర‌ళ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ కె. సుధాక‌రన్ వెల్ల‌డించారు.

ఏఐసీసీ ఆదేశాల మేర‌కే ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు చెప్పారు. ఇదిలా ఉండ‌గా ఇవాళ రాజ‌స్థాన్ లోని ఉదయ్ పూర్ లో మూడు రోజుల పాటు ఏఐసీసీ ఆధ్వ‌ర్యంలో న‌వ్ సంక‌ల్ప్ చింత‌న్ శివిర్ లో ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు సుధాక‌రన్.

ఇదిలా ఉండ‌గా పార్టీ రాష్ట్ర నాయ‌క‌త్వంతో విభేదించారు థామ‌స్. త్రిక్క‌క‌ర అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ల్లో అధికార ఎల్డీఎఫ్ అభ్య‌ర్థి జో జోసెఫ్ త‌ర‌పున ప్ర‌చారం చేస్తాన‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా తాను ఇప్ప‌టికీ కూడా కాంగ్రెస్ వాదినేనంటూ స్ప‌ష్టం చేశారు.

Also Read : వార‌ణాసి కోర్టు తీర్పుపై ఓవైసీ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!