BRS MLAS Doctors : బీఆర్ఎస్ లిస్టులో నలుగురు డాక్టర్లు
అదృష్టాన్ని పరీక్షించు కోనున్న వైద్యులు
BRS MLAS Doctors : రాబోయే ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ బాస్ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించారు. 119 అసెంబ్లీ సీట్లకు గాను 115 సీట్లను డిక్లేర్ చేశారు. ఇందులో ఏడుగురు సిట్టింగ్ లకు స్థానం ఇవ్వలేదు. వారికి వేరే చోట ఛాన్స్ ఇస్తానని స్పష్టం చేశారు.
ఇక ప్రకటించిన తాజా అభ్యర్థుల జాబితాలో విశేషం ఏమిటంటే నలుగురు డాక్టర్లకు ఎమ్మెల్యే అభ్యర్థులకు అవకాశం కల్పించారు సీఎం కేసీఆర్(KCR). ఆయన ముందు చూపు కలిగిన నాయకుడు. వైద్యులు కూడా రాజకీయాల్లోకి రావాలని ముందు నుంచి పిలుపు ఇస్తూ వచ్చారు.
BRS MLAS Doctors List
వారి అవసరం తనకు, రాష్ట్రానికి, ప్రజలకు, ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. ఇక బీఆర్ఎస్ తొలి జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థులు నలుగురు వైద్యులు ఉండడం విశేషం.
వారిలో జగిత్యాల్ నియోజకవర్గం నుంచి డాక్టర్ ఎం సంజయ్ కుమార్ కు ఛాన్స్ ఇచ్చారు. వికారాబాద్ నియోజకవర్గం నుంచి డాక్టర్ మెతుకు ఆనంద్ , భద్రాచలం నియోజకవర్గం నుంచి డాక్టర్ తెల్లం వెంకట్రావు, కోరుట్ల నియోజకవర్గం నుంచి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కు చోటు కల్పించారు. మొత్తంగా కేసీఆర్ మార్క్ డిఫరెంట్ గా ఉంటుందనేది తేలి పోయింది.
Also Read : Heath Streak : మాజీ క్రికెటర్ హీత్ స్ట్రీక్ కన్నుమూత