Naga Jyothy VS Seethakka : రసవత్తర పోరుకు ములుగు రెడీ
నాగజ్యోతి వర్సెస్ సీతక్క
Naga Jyothy VS Seethakka : బీఆర్ఎస్ లిస్టు విడుదల కావడంతో అందరి కళ్లు ములుగు నియోజకవర్గంపై పడింది. కానీ ఊహించని రీతిలో ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న దాసరి సీతక్కకు చెక్ పెట్టేందుకు హతమైన మాజీ నక్సలైట్ కూతురు నాగ జ్యోతిని రంగంలోకి దింపారు. ఆమెకు ఈసారి ములుగు నుంచి సీటు కేటాయించారు.
Naga Jyothy VS Seethakka in Mulugu Constituency
దీంతో మాజీ నక్సలైట్ వర్సెస్ మాజీ నక్సలైట్ కూతురుకు మధ్య రసవత్తర పోరాటానికి తెర లేపారు. ఎవరిని ఎక్కడ దెబ్బ కొట్టాలో కేసీఆర్ కు తెలిసినంతగా వేరే వారికి తెలియదు. దీంతో త్వరలో జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా సీతక్కకు షాక్ ఇస్తానని, గెలిచి కేసీఆర్ కు బహుమతిగా ఇస్తానని శపథం చేశారు నాగజ్యోతి. ప్రజలకు సేవ చేసేందుకు తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు.
హత్యకు గురైన నక్సలైట్ బడే నాగేశ్వర్ రావు అలియాస్ ప్రభాకర్ కూతురే ఈ నాగ జ్యోతి. ఇక మాజీ నక్సలైట్ గా ఉన్న దాసరి అనసూయ అలియాస్ దాసరి సీతక్క(Seethakka) తొలుత టీడీపీలో ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ములుగుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజలకు సేవ చేయడంలో గుర్తింపు పొందారు. కరోనా సమయంలో, వరద సమయంలో ఆమె దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు.
నాగ జ్యోతిది ఎస్ఎస్ తాడ్వాయి మండలం కలవపల్లి గ్రామం. కాకతీయ యూనివర్శిటీ నుంచి ఎమ్మె్సీ, బీఈడీ చేసింది. 2019లో సర్పంచ్ గా గెలుపొందింది. జేడ్పీటీసీ గా గెలుపొందారు. తన తండ్రి పోలీసుల ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు.
ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క కొన్నేళ్ల పాటు జనశక్తిలో ఉన్నారు. 1997లో పోలీసుల ముందు లొంగి పోయింది. 2022లో పీహెచ్ డీ పూర్తి చేసింది.
Also Read : BRS MLAS Doctors : బీఆర్ఎస్ లిస్టులో నలుగురు డాక్టర్లు
