France VS England FIFA : ఇంగ్లండ్ ఔట్ సెమీస్ కు ఫ్రాన్స్

2-1 తేడాతో విజ‌యం

France VS England FIFA : ఖ‌తార్ వేదిక‌గా జ‌రుగుతున్న ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2022లో మాజీ ఛాంపియ‌న్ ఫ్రాన్స్ సెమీ ఫైన‌ల్ కు చేరుకుంది. ఇంగ్లండ్ తో జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్ లో 2-1 తేడాతో విజ‌యం సాధించింది. ఇరు జ‌ట్లూ హోరా హోరీగా త‌ల‌ప‌డ్డాయి. ఆట‌లో భాగంగా ఫ్రాన్స్ కు చెందిన అరేలియ‌న్ ట్చౌమెస్, ఓలిలివిర్ గిరౌడ్ చెరో గోల్ చేశారు.

ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుపై మ‌రింత ఒత్తిడి పెంచ‌డంలో స‌క్సెస్ అయ్యారు. అల్ బేట్ స్టేడియంలో ఈ కీల‌క మ్యాచ్ జ‌రిగింది. ఇంగ్లండ్ త‌ర‌పున హ్యారీ కేన్ క‌ళ్లు చెదిరేలా అద్భుత‌మైన బంతిని గోల్ గా మ‌లిచాడు. ఇదిలా ఉండ‌గా ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో టైటిల్ ఫేవ‌రేట్ గా పేరొందిన పోర్చుగ‌ల్ కు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది మొరాకో.

చివ‌రి దాకా చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించ లేదు. దీంతో ఓట‌మి త‌ప్ప‌లేదు. ప్ర‌పంచ క‌ప్ ఫుట్ బాల్ చ‌రిత్ర‌లో అర‌బ్ దేశానికి చెందిన ఒక దేశం సెమీ ఫైన‌ల్ కు చేరడం ఇదే మొద‌టిసారి కావ‌డం విశేషం. ఇక బుధ‌వారం నాడు జ‌రిగే కీల‌క‌మైన సెమీ ఫైన‌ల్ లో ఇంగ్లండ్(France VS England FIFA) కు షాక్ ఇచ్చిన ఫ్రాన్స్ పోర్చుగ‌ల్ కు దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చిన మొరాకో త‌ల‌ప‌డ‌నున్నాయి.

ఈ మ్యాచ్ కోసం కోట్లాది మంది అభిమానులు ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు. గ‌త కొన్ని రోజులుగా అల‌రిస్తూ వ‌స్తున్న ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ఆఖ‌రి అంకానికి చేరుకుంది. కొద్ది రోజుల్లో ఫుట్ బాల సంబురం ముగియ‌నుంది. ఏది ఏమైనా ఈ టోర్నీలో మొరాకో అంచ‌నాల‌కు మించి ఆడింది. ఆ జ‌ట్టులో కీల‌క‌మైన మ్యాచ్ లో ప‌లువురు ఆట‌గాళ్లు గాయంతో వెనుదిరిగినా మొక్కవోని ఆత్మ విశ్వాసంతో పోర్చుగ‌ల్ ను ఢీకొంది. చారిత్రాత్మ‌క‌మైన విజ‌యాన్ని న‌మోదు చేసింది.

Also Read : పోర్చుగ‌ల్ కు షాక్ సెమీస్ కు మొరాకో

Leave A Reply

Your Email Id will not be published!