Nitish Kumar : సోష‌లిస్టుల‌తో దోస్తీ బీజేపీతో కుస్తీ – నితీశ్

కేంద్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంది

Nitish Kumar : జేడీయూ చీఫ్‌, బీహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాము ఇక నుంచి సోష‌లిస్టుల‌తో క‌లిసి ప‌ని చేస్తామ‌ని ఇక ఎన్న‌టికీ కుట్ర‌లు, కుతంత్రాలు, మ‌త భావ‌జాలంతో , రాచ‌రిక మ‌న‌స్త‌త్వంతో కొన‌సాగుతున్న భార‌తీయ జ‌న‌తా పార్టీతో పొత్తు ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

భావ సారూప్య‌త క‌లిగిన వారితో సంబంధాలు పెంచుకుంటామ‌ని ఇదే స‌మ‌యంలో బీజేపీతో కుస్తీ కొన‌సాగుతుంద‌ని చెప్పారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

కేంద్రంలో క‌ళ్లు మూసుకు పోయిన వారి చేతిలో పాల‌న సాగుతోంద‌ని మండిప‌డ్డారు. రాబోయే రోజుల్లో బీజేపీయేత‌ర నాయ‌క‌త్వానికి ప్ర‌జ‌లు జేజేలు ప‌ల‌క‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.

దేశాభివృద్ది కోసం ప‌ని చేయాల్సిన వాళ్లు దేశాన్ని విభ‌జించే ప‌నిలో నిమ‌గ్నం అయ్యారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు నితీశ్ కుమార్. మోదీ, అమిత్ షా త్ర‌యం ఎన్ని కుట్ర‌లు, కుతంత్రాలు, వ్యూహాలు ప‌న్నినా బీహార్ లో త‌న‌ను క‌ద‌ల్చ‌లేర‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

దేశంలో మిగ‌తా రాష్ట్రాలు వేరు బీహార్ వేర‌ని గుర్తు పెట్టుకోవాల‌ని సూచించారు. త‌న‌తో దోస్తీ చేస్తున్న‌ట్లు న‌టించి త‌న‌ను వెన్ను పోటు పొడిచేందుకు బీజేపీ ప్ర‌య‌త్నం చేసింద‌ని ఆరోపించారు. కానీ త‌న రాజ‌కీయ అనుభ‌వం ముందు అమిత్ షా ఎంత అని ప్ర‌శ్నించారు.

తాను కింది స్థాయి నుంచి వ‌చ్చిన వాడిన‌ని కానీ గ‌త 20 ఏళ్ల నుంచి షా రాజ‌కీయం చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఒక‌ప్పుడు బీజేపీలో నాయ‌కులంటే గౌర‌వం ఉండేద‌ని కానీ మోదీ వ‌చ్చాక ఆ ఉన్న గౌర‌వం కూడా పోయింద‌న్నారు సీఎం.

Also Read : అశోక్ గెహ్లాట్ పై శ‌శి థ‌రూర్ క‌న్నెర్ర‌

Leave A Reply

Your Email Id will not be published!