PM Modi : జీ20 అధ్య‌క్ష ప‌ద‌వి భార‌త్ కు ద‌క్కిన గౌర‌వం

పాల‌నా సామ‌ర్థ్యానికి ల‌భించిన గుర్తింపు

PM Modi : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌లే ఇండోనేషియాలోని బాలిలో జ‌రిగిన టి20 శిఖరాగ్ర స‌ద‌స్సులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. మొత్తం 19 ప్ర‌ధాన దేశాలు ఇందులో స‌భ్య‌త్వం క‌లిగి ఉన్నాయి. ఈసారి అధ్య‌క్ష ప‌ద‌విని భార‌త దేశం చేప‌ట్ట‌నుంది.

ఇప్ప‌టికే ఇండోనేషియా దేశ అధ్య‌క్షుడు బాధ్య‌త‌ల‌ను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి(PM Modi)  అప్ప‌గించారు. ఈ సంద‌ర్భంగా మ‌రోసారి జి20ని గుర్తు చేసుకున్నారు మోదీ. ఆదివారం మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగించారు.

ఆయ‌న త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నారు. ప్ర‌తి నెలా మ‌న్ కీ బాత్ రేడియో కార్య‌క్ర‌మం కొన‌సాగుతూ వ‌స్తోంది. అత్యున్న‌త‌మైన ప‌ద‌వి ద‌క్క‌డం మామూలు విష‌యం కాద‌న్నారు. భార‌త దేశం గ‌త ఎనిమిదేళ్ల కాలంలో ప్ర‌పంచ మార్కెట్ ను ప్ర‌భావితం చేస్తోంద‌ని చెప్పారు.

టెక్నాల‌జీ రోజు రోజుకు మారుతోంద‌ని దానికి అనుగుణంగా మ‌నం కూడా మారాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి(PM Modi) . అంతే కాకుండా విక్ర‌మ్ – ఎస్ రాకెట్ ను , పీఎస్ఎల్వీ -సీ54ను ప్ర‌యోగించ‌డాన్ని ప్ర‌శంసించారు. ప్ర‌స్తుతం జి20 అధ్య‌క్ష ప‌ద‌వి వ‌ల్ల మ‌రింత బాధ్య‌త త‌న‌పై పెరిగింద‌న్నారు.

శాంతి, ఐక్య‌త‌, సుస్థిర అభివృద్దిపై ఫోక‌స్ పెట్టాల‌న్నారు. ప్ర‌పంచ వాణిజ్యంలో మూడు వంత‌ల వ్యాపారం, వాణిజ్యం ఒక్క భార‌త దేశంలోనే జ‌రుగ‌తోంద‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి. రోద‌సీ ప‌రంగా భార‌త్ త‌న విజ‌యాన్ని పొరుగు దేశాల‌తో కూడా పంచుకుంటోంద‌ని స్ప‌ష్టం చేశారు.

గాంధీకి ఇష్ట‌మైన వైష్ణ‌వ‌న జాన అనే గీతాన్ని ట్విట్ట‌ర్ లో పంచుకున్నారు.

Also Read : తెగించే వ‌చ్చా తాట తీస్తా – ప‌వ‌న్ కళ్యాణ్

Leave A Reply

Your Email Id will not be published!