Gautam Gambhir : భారత క్రికెట్ జట్టు మాజీ స్టార్ ప్లేయర్, ఢిల్లీ ఎంపీ, లక్నో మెంటార్ గా ఉన్న గౌతం గంభీర్(Gautam Gambhir )కీలక వ్యాఖ్యలు చేశారు. రెండో టెస్టులో ఓడి పోవడం బాధాకరమే అయినప్పటికీ రహానే, విహారి అద్భుతంగా రాణించారని పేర్కొన్నాడు.
విచిత్రం ఏమిటంటే 7 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది సౌతాఫ్రికా. ఈ తరుణంలో ప్రధాన ఆటగాళ్లు ఎందుకని పరుగులు చేయలేక పోతున్నారనే దానిపై ఫోకస్ పెట్టాలని సూచించాడు గంభీర్.
చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే ద్వయం మూడో వికెట్ కు 111 పరుగులు జోడించారు. ఇద్దరూ చురుకైన రన్ రేట్ తో ఆడారు. పుజారా 86 బంతులు ఎదుర్కొని 53 పరుగులు చేస్తే రహానే 76 బంతులు ఆడి 56 పరుగులు చేశాడు.
ఆ తర్వాత అనవసరమైన షాట్స్ కోసం వెళ్లి వికెట్లను పారేసుకున్నారంటూ మండిపడ్డాడు గౌతం గంభీర్. ప్రత్యర్థి జట్టుతో ఆడేటప్పుడు ఎందుకు ఏకాగ్రత ఉండడం లేదని ప్రశ్నించాడు.
పుజారా, రహానే స్థానాలను విహారికి చాన్స్ ఇచ్చి వుండి ఉంటే అద్భుతంగా రాణించి ఉండేవాడని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉండగా రెండో టెస్టులో విహారి 40 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు.
చివరి దాకా ఉంటూ నాటౌట్ గా నిలిచాడు. కాగా గేమ పరంగా సుదీర్ఘమైన ఫార్మాట్ లో తనను తాను నిరూపించుకునేందుకు విహారికి చాలా అవకాశాలు ఇవ్వ లేదని మండిపడ్డాడు గౌతం గంభీర్(Gautam Gambhir ).
కోహ్లీ గనుక వస్తే అతడికి ప్లేస్ దొరకడం కష్టమవుతుందన్నాడు. పుజారా, రహానే, విహారీలకు తదుపరి మూడో టెస్టులో తప్పక చాన్స్ ఇవ్వాలని స్పష్టం చేశాడు.
Also Read : విండీస్ చీఫ్ సెలెక్టర్ గా డెస్మండ్ హేన్స్