అహ్మదాబాద్ : తన శిక్షణలో రాటు దేలిన భారత జట్టు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐసీసీ టి20 వరల్డ్ కప్ విజేతగా నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కోచ్ గౌతం గంభీర్. ఈ కప్ ను ఇద్దరు వ్యక్తులకు అంకితం ఇస్తున్నానని ప్రకటించాడు. కోట్లాది మందిని విస్తు పోయేలా చేశాడు . తన అత్యల్ప దశలో తన పక్కన నిలిచిన వ్యక్తిని పేర్కొన్నాడు. ఈ గెలుపును గంభీర్ రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ లకు అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు. తనకు మద్దతు ఇచ్చినందుకు గాను బీసీసీఐ కార్యదర్శి జే షాకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇండియా కప్ విన్ అయ్యాక గంభీర్ మీడియాతో మాట్లాడాడు.
2026 సంవత్సరం గౌతమ్ గంభీర్ కు ఒక రకమైన గుర్తింపుగా నిలిచింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా , దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లలో ఓడిపోయిన తర్వాత, ప్రపంచ ఛాంపియన్ ఆటగాడు తీవ్ర విమర్శలకు గురయ్యాడు. కానీ అనూహ్యంగా తన వ్యూహాలను అమలు చేస్తూ పోయాడు. తను ఎంచుకున్న ఆటగాళ్లకు మద్దతు ఇచ్చాడు. ఆపై వారిలో విశ్వాసం నింపాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన అర్ధంలేని శైలికి కట్టుబడి, డ్రెస్సింగ్ రూమ్‌లోని వ్యక్తులకు మాత్రమే తాను జవాబుదారీ అని గంభీర్ ప్రకటించాడు. ఇదిలా ఉండగా టీం ఇండియా ఇప్పటి వరకు మూడు టి20 ప్రపంచ కప్ లను గెలుచుకుంది. 2007లో , 2004లో , 2026లో సత్తా చాటింది.
