#Gangavva : తెలంగాణ సంపదత్వం గంగవ్వకు వందనం
గంగవ్వ ఒక్క రోజులో స్టార్ అయి పోలేదు. ఇవాళ లోకమంతా తన వైపు చూసుకునేలా తనను తాను రూపు దిద్దుకున్న తీరు ప్రతి ఒక్కరికి పాఠంగా మిగిలి పోతుంది. ఆమె సాదారణ తెలంగాణలోని మారుమూల ఊరుకు చెందిన సాదారణమైన మనిషి. విజయం సాధించాలంటే వయసుతో పనేంటి..గెలుపు రుచి చూడాలంటే సిఫారసుతో పనేంటి. కాలం తనంతకు తాను చేతి కర్రలా తోడైతే అద్భుతాలు మనముందు ఆవిష్కృతమవుతాయి. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. మన కళ్ల ముందున్న సక్సెస్ స్వంతం చేసుకున్న అసలు సిసలైన విజేత. గంగవ్వ పేరు ఎల్లలు దాటింది. తనకంటూ ఓ బ్రాండ్ ఉండేలా మలుచుకుంది.
Gangavva : నిప్పులు చిమ్ముకుంటూ నేనెగిరి పోతే..నిబిడాశ్చర్యంతో మీరే మీరే అంటూ ప్రపంచాన్ని విస్మయ పరిచేలా చేసింది తెలంగాణ మట్టితనం కలబోసుకున్న గంగవ్వ. పారే సెలయేరు..కురిసే వాన చినుకులు..పరుగులు తీసే లేగ దూడల కలవరింతలకు ఎవరు నేర్పారు..అలాగే గంగవ్వ ఒక్క రోజులో స్టార్ అయి పోలేదు. ఇవాళ లోకమంతా తన వైపు చూసుకునేలా తనను తాను రూపు దిద్దుకున్న తీరు ప్రతి ఒక్కరికి పాఠంగా మిగిలి పోతుంది. ఆమె సాదారణ తెలంగాణలోని మారుమూల ఊరుకు చెందిన సాదారణమైన మనిషి. విజయం సాధించాలంటే వయసుతో పనేంటి..గెలుపు రుచి చూడాలంటే సిఫారసుతో పనేంటి. కాలం తనంతకు తాను చేతి కర్రలా తోడైతే అద్భుతాలు మనముందు ఆవిష్కృతమవుతాయి. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. మన కళ్ల ముందున్న సక్సెస్ స్వంతం చేసుకున్న అసలు సిసలైన విజేత. గంగవ్వ పేరు ఎల్లలు దాటింది. తనకంటూ ఓ బ్రాండ్ ఉండేలా మలుచుకుంది.
ప్రతి కథ వెనుక మలుపులు..మజిలీలు..కన్నీళ్లు..కలబోతలు..సంతోషాలు..ఉంటాయి. ఈ జిందగీ ఒక్కోసారి పైకి తెస్తుంది. ఇంకోసారి అనామకులను సైతం చరిత్ర విస్తు పోయేలా రికార్డు క్రియేట్ చేసేలా చేస్తుంది. టెక్నాలజీ డామినేట్ చేస్తున్న సమయంలో ఓ పల్లెటూరుకు చెందిన గంగవ్వ ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పోయేలా కృషి చేసింది. సామాజిక మాధ్యమాల్లో గంగవ్వ ఓ ఐకాన్. మై విలేజ్ షో తో ఒక్కసారిగా గంగవ్వ వరల్డ్ స్టార్ గా పేరొందారు. అందుకేనేమో ప్రచురణ, ప్రసార మాధ్యమాలన్నీ ఆమె కోసం వెంట పడుతున్నాయి. కథలను ప్రసారం చేస్తున్నాయి. తనతో పాటు ఆ ఊరికి పేరు తీసుకు వచ్చిన ఘనత గంగవ్వదే అయినా, ప్రపంచానికే పోరాటాలతో, ఉద్యమాలతో పాఠం నేర్పిన తెలంగాణ అస్తిత్వం ఆమెను మనిషిని చేసింది. ఇతరులు తనను చూసి నేర్చుకునేలా, స్ఫూర్తి పొందేలా..నిత్యం ప్రాతః స్మరణీయం అనుకునేలా సక్సెస్ ను స్వంతం చేసుకుంది. గంగవ్వ ఇపుడు పేరు మాత్రమేనా కాదు ఆకాశాన్ని అలుముకున్న వెలుగు దివ్వె.
గూగుల్ అనుబంధ సంస్థ యూట్యూబ్ లో గంగవ్వ స్టార్ గా వెలుగొందుతోంది. ఆమె ప్రస్థానం వెనుక..గంగవ్వ ప్రయాణం వెనుక ఎందరో తోడుగా నిలిచారు. ఆమెలోని ప్రతిభను..పల్లెతనపు యాసను గుర్తించారు. పల్లె ప్రజలు వారి మాటలు..కదలికలు..హావభావాలు..నడతలు..కలలు..కన్నీళ్లు..సంచారాన్ని కళ్లకు కట్టినట్లు అవ్వతోనే అనిపించారు. ఆమెకు తెలియకుండానే గంగవ్వలోని సహజత్వానికి దగ్గరగా ఉండేలా జాగ్రత్త పడ్డారు. అదే మై విలేజ్ షో పేరుతో పురుడు పోసుకుంది. యూట్యూబ్ లో గంగవ్వకు తిరుగే లేకుండా పోయింది. ఒక్క వీడియో అప్ లోడ్ చేస్తే చాలు..క్షణాల్లో లక్షల్లో లైకులు..నిమిషాల్లో ట్రెండింగ్..వైరల్ అవుతోంది. పల్లెల్లో కూడా సౌందర్యం ఉంటుంది. అంతకంటే ఎల్లెలు ఎరుగని ..కల్మషం లేని మనుషుల కలబోతలు ఉంటాయని ఈ షో నిరూపిస్తోంది. గంగవ్వ మాట్లాడుతుంటే మనం ఇంట్లో మాట్లాడుకున్నట్లే..మన అమమ్మలు..నాయనమ్మలు..అవ్వలు..పెద్దలు..తాతయ్యలతో ఉన్నట్లే ఉంటుంది. అందుకే కోట్లాది ప్రజలు లోకమంతటా గంగవ్వకు ఫిదా అయ్యారు. కలల రాకుమారుడు నాగార్జున సైతం అవ్వతో ఓ షో కూడా చేశారు. అది కూడా ఓ చరిత్రే.
కూలీగా, కార్మికురాలిగా తన బతుకును ఆరంభించింది గంగవ్వ. చిన్న గాయం తగిలితే చాలు తల్లడిల్లి పోయే పిల్లలు, యువతీ యువకులు సైతం ఆమెను చూసి నేర్చు కోవాల్సింది ఎంతో ఉంది. టెక్నాలజీనే లైఫ్ అనుకుంటూ విలువైన కాలాన్ని, యవ్వనాన్ని, జీవితాన్ని కోల్పోతున్న వాళ్లకు ఆమె రియల్ ఇన్సిఫిరేషన్. అటూ ఇటుగా చూస్తే గంగవ్వకు 60 ఏళ్లు. కానీ ఇప్పటికీ చైతన్యం , ధైర్యం కోల్పోని ధీరవనిత. అవ్వకు నలుగురు పిల్లలు. ఒక కూతురు చనిపోయింది. ఊరు లోనే మకాం. లంబాడిపల్లిలోనే అవ్వతో కమ్మని ముచ్చట. అవ్వ నవ్వితే పొలంలో వరి నారు గాలికి కదలాడినట్లు ఉంటది. 2016లో యూట్యూబ్ లో ప్రవేశించింది. ఇప్పటికీ నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఎన్నో వీడియోలు..మరెన్నో ప్రోగ్రాంలలో పాల్గొంది. స్టార్ మా చేపట్టిన బిగ్ బాస్ తో గంగవ్వ మరో స్టార్ గా నిలిచింది. ఆరోగ్యం సహకరించక పోటీలో నుంచి నిష్క్రమించినా ఆమెకు ఆదరణ తగ్గలేదు. హోస్ట్ గా ఉన్న నాగ్ ఏకంగా అవ్వ కోసం ఏకంగా ఇల్లు ఇస్తున్నానంటూ ప్రకటించాడు.
వచ్చిన డబ్బులతో బంగారు గొలుసు కొనుక్కొంది. గంగవ్వలోని ప్రతిభను గుర్తించి ..స్టార్ గా వెలుగొందేలా చేసింది మాత్రం ఆమె అల్లుడు శ్రీరాం. తెలంగాణలో గంగవ్వ ఓ సెలబ్రెటీ. అంతేనా ఆమె ఓ బ్రాండ్ అంబాసిడర్. అవ్వలోని టెక్నిక్ ను ..వాయిస్ ను గుర్తించిన సినిమా రంగం అక్కున చేర్చుకుంది. మల్లేషం సినిమాలో అవ్వకు అవకాశం వచ్చింది. పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఓ రోల్ లో నటించి..మెప్పించింది. తెలంగాణ ప్రభుత్వం విశిష్ట మహిళా పురస్కారం అందజేసింది. గవర్నర్ నుండి ఉమెన్ అచీవర్ అవార్డు స్వీకరించింది. 2018, 2019 లలో హైదరాబాద్ లో యూట్యూబ్ నిర్వహించిన ఫ్యాన్ షో కేస్ ప్రోగ్రాంలో పాల్గొంది. పలు తెలుగు న్యూస్ ఛానల్స్ లలో నటించింది. 2019లో నాస్కాం ఫౌండేషన్ టెక్ షోలో వక్తగా ప్రూవ్ చేసుకుంది. ఇదే ఇయర్ లో పద్మ మోహన పురస్కారం పొందింది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన సిఎన్ఎన్ ఇంటర్నేషనల్ ఛానల్ గంగవ్వ సక్సెస్..లైఫ్ స్టోరీని టెలికాస్ట్ చేసింది. ఇది ఓ తెలంగాణ పల్లెతనం కలబోసుకున్న మట్టి మనిషి సాధించిన అరుదైన ఘనత. చరిత్ర. చరిత్ర సృష్టించాలంటే..గెలుపు సాధించాలంటే..కష్టాలు అధిగమించాలంటే..సక్సెస్ స్వంతం కావాలంటే..విజయపు అంచులను అందు కోవాలనుకుంటే..ప్రపంచం విస్తు పోయేలా చూడాలనుకుంటే తెలివితో పని లేదు..విజ్ఞానం అక్కర్లేదు..వయసుతో సంబంధం లేదని నిరూపించింది గంగవ్వ. అందుకే అవ్వకు వందనం..జిందగీతో మమేకమైన బతుకుతున్న సామాన్యులైన అసమాన్య పేద ప్రజలకు..మట్టి బిడ్డలకు..ఊరి జనాలకు అభివందనం.
No comment allowed please