Ganguly VS Ranbir Kapoor : బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ ఏది చేసినా ఓ సంచలనమే. తాజాగా ఈడెన్ గార్డెన్ మైదానంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ బీర్ కపూర్ తో తలపడ్డాడు. తాను నటించిన సినిమా ప్రమోషన్ లో భాగంగా కోల్ కతా కు చేరుకున్నాడు. ఈ సందర్భంగా సౌరవ్ గంగూలీ సారథ్యంలోని ఝూతీ ఎలెవన్ రణ్ బీర్ కపూర్ సారథ్యంలోని మక్కర్ ఎలెవన్ మధ్య సరదాగా మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా అద్భుతమైన బ్యాటర్ గా పేరొందిన గంగూలీ బౌలింగ్ చేశాడు. రణ బీర్ కపూర్ బ్యాటింగ్ చేశాడు.
ఈ ఇద్దరి ఆట చూసేందుకు అటు క్రికెట్ ఫ్యాన్స్ ఇటు సినీ అభిమానులు తరలి వచ్చారు. మ్యాచ్ ను తెగ ఎంజాయ్ చేశారు. ఇది కేవలం సినిమా ప్రమోషన్ లో భాగంగానే ఏర్పాటు చేసినట్లు తెలిపారు నిర్వాహకులు.
ఇదిలా ఉండగా రణ బీర్ కపూర్ తన తాజా చిత్రం తూ ఝూతీ మైన్ మక్కార్ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా దేశమంతటా తిరుగుతున్నాడు. బెంగాల్ అంటేనే మొదటగా గుర్తుకు వచ్చేది సౌరవ్ గంగూలీ.
ఆయనను అక్కడ అంతా దాదా అని ముద్దుగా పిలుచుకుంటారు. అంతే కాదు బెంగాల్ టైగర్ అని కూడా పిలుస్తారు. అక్కడి వారికి ఆయనంటే అంతులేని అభిమానం. గంగూలీ, రణబీర్ కపూర్ జట్ల(Ganguly VS Ranbir Kapoor) మధ్య జరిగిన మ్యాచ్ ను యూట్యూబ్ లో ఎక్స్ ట్రా టైమ్ పోస్ట్ చేసింది. రణ్ బీర్ గూంగలీ నుండి 10 బంతులు ఎదుర్కొన్నాడు. ఇందులో ఒక సిక్స్ కూడా ఉంది. ఇక సినిమా మార్చి 8న విడుదల కానుంది.
Also Read : కీవీస్ అద్బుతం ఒక్క పరుగుతో విజయం