Gautam Adani : గౌతమ్ అదానీ భారీగా పెట్టుబడులు
150 బిలియన్ డాలర్లకు ప్లాన్
Gautam Adani : అదానీ గ్రూప్ కంపెనీ చైర్మన్ గౌతమ్ అదానీ(Gautam Adani) సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే ప్రపంచంలోని కుబేరుల జాబితాలో నెంబర్ 2 గా ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్న రంగాలతో పాటు అదనంగా ఇతర రంగాలలో కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టనున్నారు.
ట్రిలియన్ డాలర్ల వాల్యూయేషన్ తో గ్లోబల్ కంపెనీగా మార్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తాజాగా గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు, ఎయిర్ పోర్ట్ లు, సిమెంట్ , హెల్త్ కేర్ వంటి వ్యాపారాలలో అదానీ గ్రూప్ 150 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టనుంది. అక్టోబర్ 10న జరిగిన సమావేశంలో అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాబీ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇదిలా ఉండగా 1988లో ట్రేడర్ గా మొదలు పెట్టారు గౌతమ్ అదానీ(Gautam Adani). ఆ తర్వాత మెల మెల్లగా ఓడరేవులు, విమానాశ్రయాలు, రోడ్లు, పవర్ , పునరుత్పాదక ఇంధనం, పవర్ ట్రాన్స్ మిషన్ , గ్యాస్ పంపిణీ వ్యాపారాలలో వేగంగా విస్తరించే ప్రయత్నం చేశారు. తాజాగా డేటా సెంటర్స్ , ఎయిర్ పోర్టలు, పెట్రో కెమికల్స్ , సిమెంట్ , మీడియా వ్యాపారాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.
వచ్చే 10 ఏళ్లలో గ్రీన్ హైడ్రోజన్ బిజినెస్ లో 70 బిలియన్ డాలర్లు, గ్రీన్ ఎనర్జీలో 23 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు గౌతమ్ అదానీ. అంతే కాకుండా పవర్ ట్రాన్స్ మిషన్ లో 7 బిలియన్ డాలర్లు, ట్రాన్స్ పోర్ట్ యుటిలిటీలో 12 బిలియన్ డాలర్లు, రహదారుల రంగంలో 5 బిలియన్ డాలర్లు పెట్టనున్నట్లు చెప్పారు అదానీ.
Also Read : జెఫ్ బెజోస్ అదానీ నువ్వా నేనా