Gautam Adani : రాజ‌స్థాన్ లో అదానీ భారీ పెట్టుబ‌డి

రూ. 65,000 వేల కోట్ల ఇన్వెస్ట్ మెంట్

Gautam Adani : ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త గౌత‌మ్ అదానీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాజ‌స్థాన్ ఇన్వెస్ట్ 2022 పేరుతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన స‌మ్మిట్ కు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు గౌత‌మ్ అదానీ(Gautam Adani). ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో రూ. 65,000 కోట్ల‌ను పెట్టుబ‌డిగా పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

వీటి ఏర్పాటు వ‌ల్ల ప్ర‌త్యక్షంగా, ప‌రోక్షంగా 40,000 వేల మందికి ఉపాధి ల‌భిస్తుంద‌ని చెప్పారు. రాష్ట్ర ప్ర‌భుత్వంతో క‌లిసి మ‌రో రెండు ప్రాజెక్టుల‌పై త‌మ బృందం ప‌ని చేస్తోంద‌ని తెలిపారు గౌత‌మ్ అదానీ. ఎలాంటి సౌక‌ర్యాలు లేని జిల్లాల్లో రెండు మెడిక‌ల్ కాలేజీలు, ఆస్ప‌త్రులు ఏర్పాటు చేస్తామ‌న్నారు.

అంతే కాకుండా ఉద‌య్ పూర్ లో క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ప్ర‌భుత్వానికి స‌హ‌కారం అంద‌జేస్తామ‌ని చెప్పారు. ఈ విష‌యం గురించి సీఎం అశోక్ గెహ్లాట్ తో చ‌ర్చిస్తున్న‌ట్లు తెలిపారు గౌత‌మ్ అదానీ. త‌న‌ను గౌత‌మ్ భాయ్ అని ప్ర‌శంసించిన అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) కు ధ‌న్య‌వాదాలు చెప్పారు.

ఇదిలా ఉండ‌గా గుజ‌రాత్ ఇప్పుడు ధీరూభాయ్ అంబానీ, గౌత‌మ్ భాయ్ వంటి గొప్ప పారిశ్రామిక‌వేత్త‌ల‌ను , వ్యాపార‌వేత్త‌ల‌ను త‌యారు చేసిందంటూ కితాబు ఇచ్చారు అశోక్ గెహ్లాట్. మ‌రో వైపు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మాత్రం వ్యాపార వేత్త‌లైన గౌత‌మ్ అదానీ, ముకేష్ అంబానీ, టాటాల‌ను ఏకి పారేస్తున్నారు.

వీరి వ‌ల్ల‌నే దేశం ఇబ్బందుల‌కు గుర‌వుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ త‌రుణంలో రాజ‌స్థాన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గెహ్లాట్ గౌత‌మ్ అదానీని ప్ర‌శంసించ‌డం చ‌ర్చ‌కు దారితీసింది.

Also Read : త్వ‌ర‌లో ఇ-రూపాయి లాంచ్ – ఆర్బీఐ

Leave A Reply

Your Email Id will not be published!