Gautam Adani Group Top : టాటాలను దాటేసిన అదానీ గ్రూప్
భారత దేశంలో అత్యంత విలువైన కంపెనీ
Gautam Adani Group Top : గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ సంస్థలు(Gautam Adani Group Top) ఇప్పుడు భారత దేశంలో అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. ఇప్పటి వరకు కొన్నేళ్లుగా తన స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్న టాటాలను అధిగమించడం విశేషం.
ఇదిలా ఉండగా అదానీ గ్రూప్ ఆఫ్ ఫర్మ్ ల మొత్తం మార్కెట్ విలువ రూ. 22 లక్షల కోట్లకు పైగా చేరింది. దీంతో టాప్ మోస్ట్ వాల్యూయేబుల్ కంపెనీగా అవతరించింది.
అదానీ గ్రూప్ కు చెందిన అన్ని బీఎస్ఈ లిస్టెడ్ స్టాక్ ల మార్కెట్ విలువ, ఇటీవల కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్, ఏసీసీ లిమిటెడ్ సహా మొత్తం తొమ్మిది సంస్థల వ్యాపార విలువ రూ. 22 లక్షల కోట్లకు పైగా ఉంది.
ఇప్పటి వరకు మార్కెట్ లో లిస్టు చేయబడిన టాటా గ్రూప్ సంస్థలలోని 27 కంపెనీలను అధిగమించింది. రూ. 20 లక్షల కోట్లను టాటా సంస్థలు కలిగి ఉన్నాయి.
కానీ ఇప్పుడు అదానీ గ్రూప్ సంస్థలు(Gautam Adani Group Top) మరో 2 లక్షల కోట్లను స్వంతం చేసుకుంది. ఇక టాటా గ్రూప్ ల తర్వాత రిలయన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్ ముఖేష్ అంబానీకి సంబంధించి తొమ్మిది కంపెనీలతో కూడిన గ్రూప్ రూ. 17 లక్షల కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ తో జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది.
ఇప్పటికే ప్రపంచ బిలియన్ల జాబితాలో అమెజాన్ చీఫ్ బెజోస్ ను వెనక్కి నెట్టి వేశారు గౌతమ్ అదానీ. ఏకంగా వరల్డ్ లోనే రెండో కుబేరుడిగా అవతరించారు. ఇది ఒక రకంగా ఇతర దేశాలను విస్తు పోయేలా చేసింది.
Also Read : కాఫీ బోర్డు ఆఫ్ ఇండియా సభ్యుడిగా శ్రీశాంత్