Gautam Adani Mukesh Ambani : ముఖేష్ నాకు బెస్ట్ ఫ్రెండ్

అత‌డంటే గౌర‌వం అన్న గౌతమ్ అదానీ

Gautam Adani Mukesh Ambani : భార‌త దేశంలో ఇద్ద‌రూ బ‌డా వ్యాపార‌వేత్తం అయిన‌ప్ప‌టికీ మా మ‌ధ్య మంచి స్నేహం ఉంద‌న్నారు అదానీ గ్రూప్ చైర్మ‌న్ గౌత‌మ్ అదానీ(Gautam Adani Mukesh Ambani) . ఆయ‌న రిల‌య‌న్స్ గ్రూప్ చైర్మ‌న్ ముఖేష్ అంబానీ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌రి వ్యాపారం వారిదేన‌ని అన్నారు. తాము ఇద్ద‌రం గుజ‌రాత్ నుంచి వ‌చ్చామ‌ని ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం తమ మ‌ధ్య ఉంటుంద‌న్నారు అదానీ.

ఇద్ద‌రూ 1991లో భార‌త దేశం త‌న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను తెరిచే కంటే ముందు విస్తార‌మైన వ్యాపార సామ్రాజ్యాల‌ను నియంత్రించారు. తాను ఇప్ప‌టికీ రిల‌య‌న్స్ సంస్థ‌ల చైర్మ‌న్ ధీరూభాయ్ అంబానీని రోల్ మోడ‌ల్ గా భావిస్తాన‌ని చెప్పారు. ముఖేష్ అంటే గౌర‌వం కూడా ఉంద‌న్నారు.

రిల‌య‌న్స్ కి జియో, టెక్నాల‌జీ, రిటైల్ తో పాటు పెట్రో కెమిక‌ల్స్ కు విస్త‌రించారు. దేశ పురోగ‌తికి దోహ‌ద ప‌డ్డార‌ని అన్నారు అదానీ. ఇద్ద‌రం ఒకే బాట‌లో ప్ర‌యాణం చేస్తున్నాం. కానీ ఏనాడూ మేం పోటీ ప‌డింది లేద‌న్నారు. మా ఇద్ద‌రి మ‌ధ్య స‌త్ సంబంధాలు ఉన్నాయ‌ని దానిని ఎన్న‌డూ పోటీగా భావించ‌డం లేద‌న్నారు గౌత‌మ్ అదానీ.

అదానీ బొగ్గు, ఓడ రేవుల వ్యాపారం , రిల‌య‌న్స్ బాస్ గ్రీన్ ఎన‌ర్జీకి విస్త‌రించ‌డంలో ఫోక‌స్ పెట్టారు. అయితే గ‌త ఏడాది రిల‌య‌న్స్ అంబానీ ని దాటేసి టాప్ లోకి వ‌చ్చిన‌ప్పుడు ఏమైనా ఫీల్ అయ్యారా అన్న ప్ర‌శ్న‌కు గౌత‌మ్ అదానీ(Gautam Adani Mukesh Ambani)  ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. తాను ఆ సంఖ్య‌లో ప‌డ‌లేద‌ని , చిక్కుకో ద‌ల్చు కోలేద‌న్నారు. త‌మ‌కు వ్యాపారం త‌ప్ప సంఖ్య‌ల మీద ఆస‌క్తి ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : మేం 22 రాష్ట్రాల్లో వ్యాపారం చేస్తున్నాం

Leave A Reply

Your Email Id will not be published!