Adani Supreme Court : సుప్రీం నిర్ణయం శిరోధార్యం – అదానీ
చివరకు సత్యమే గెలుస్తుంది
Adani SC Orders : అదానీ హిండెన్ బర్గ్ వివాదంపై గురువారం భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసు విచారణ చేపట్టిన ధర్మాసనం సంచలన ప్రకటన చేసింది. అదానీ స్టాక్ రూట్ పై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ 2 నెలల్లో విచారణను పూర్తి చేసి వాస్తవ పరిస్థితికి సంబంధించి నివేదిక తమకు సమర్పించాలని ఆదేశించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్.
ఈ సందర్బంగా సర్వోన్నత న్యాయ స్థానం ఇచ్చిన తీర్పుపై స్పందించారు అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ. ఇవాళ ఆయన మాట్లాడుతూ కోర్టు తీర్పును తాను శిరసా వహిస్తానని , ఈ సందర్భంగా స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ లోపు నివేదిక అందజేసేందుకు తాము సహకరిస్తామని చెప్పారు.
ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు గౌతమ్ అదానీ. అదానీ గ్రూప్ పై షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ నివేదిక వల్ల తలెత్తే సమస్యలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను బిలీయనీర్ అదానీ(Adani SC Orders) స్వాగతించారు.
ఇదిలా ఉండగా రిటైర్డ్ జడ్జి అభయ్ మనోహర్ సప్రే నేతృత్వంలోని కమిటీలో ప్రముఖ బ్యాంకర్లు కేవీ కామత్ , ఓపీ భట్ , ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని , ఓపటీ భట్ , రిటైర్డ్ జస్టిస్ జేపీ దేవధర్ సభ్యులుగా ఉంటారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిపుణుల కమిటీ అదానీ వివాదంపై విచారణ జరుపుతుంది. చట్ట బద్దమైన ఫ్రేమ్ వర్క్ ను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటుందని సీజేఐ స్పష్టం చేశారు.
Also Read : కేంద్ర నిర్ణయం ప్రజాస్వామానికి ప్రమాదం