Gautam Gambhir Lanka Flag : శ్రీలంక జెండాతో గౌతం గంభీర్
సోషల్ మీడియాలో హల్ చల్
Gautam Gambhir Lanka Flag : మాజీ క్రికెటర్, భారతీయ జనతా పార్టీ ఎంపీ, కామెంటేటర్, మెంటార్ గా ఉన్న గౌతం గంభీర్ ఏది చేసినా అది సంచలనమే. యూఏఈ వేదికగా ఆసియా కప్ -2022 జరిగింది.
ఈ సందర్భంగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక పాకిస్తాన్ ను ఓడించింది. ఆరోసారి ఛాంపియన్ గా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండానే బలమైన జట్లకు కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఇదిలా ఉండగా అరబ్ మైదానంలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. కప్ గెలిచిన ఆనందంలో సంతోషంలో మునిగి పోయారు లంకేయులు. ఇదే సమయంలో వారంతా విస్తు పోయారు.
ఎందుకంటే దిగ్గజ ఆటగాడిగా పేరొందిన గౌతం గంభీర్ శ్రీలంక దేశానికి చెందిన జాతీయ పతాకాన్ని(Gautam Gambhir Lanka Flag) పట్టుకున్నారు. గౌరవ సూచకంగా ఆయన దానిని హత్తుకున్నారు.
అద్భుత విజయాన్ని సాధించినందుకు వారికి ఈ రూపకంగా ధన్యవాదాలు తెలిపారు. దీంతో స్టేడియంలోని శ్రీలంక క్రికెటర్లతో పాటు అభిమానులు, శ్రీలంక దేశానికి చెందిన ప్రజలంతా గౌతం గంభీర్ క్రీడా స్ఫూర్తికి ఫిదా అయ్యారు.
వారంతా గంభీర్ కు కంగ్రాట్స్ తెలిపారు. ఇలాంటి సన్నివేశాలు ఇరు దేశాల మధ్య మరింత బలాన్ని, బంధాన్ని పెంపొందించేలా చేస్తాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం గౌతం గంభీర్ కు సంబంధించిన వీడియోతో పాటు ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నిమిషాల్లోనే వైరల్ గా మారింది ఈ వీడియో.
ఇదిలా ఉండగా భారత దేశానికి చెందిన క్రీడాభిమానులు మొత్తం శ్రీలంక జట్టుకు సపోర్ట్ చేశారు. వారంతా పాకిస్తాన్ గెలవ కూడదని కోరుకున్నారు.
Also Read : భారత సెలెక్టర్లపై అజ్జూ ఆగ్రహం
Superstar team…Truly deserving!! #CongratsSriLanka pic.twitter.com/mVshOmhzhe
— Gautam Gambhir (@GautamGambhir) September 11, 2022