Gautam Gambhir : భారత మాజీ క్రికెటర్, లక్నో మెంటర్, ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ (Gautam Gambhir)సంచలన కామెంట్స్ చేశాడు. భారత జట్టు 0-3తో వన్డే సీరీస్ 1-2 తేడాతో టెస్టు సీరీస్ కోల్పోయిన తర్వాత సీరియస్ గా స్పందించాడు.
ప్రధానంగా వెంకటేశ్ అయ్యర్ పై నిప్పులు చెరిగాడు. అతడిని వన్డే సీరీస్ కు ఎందుకు ఎంపిక చేశారో తనకు అర్థం కాలేదంటూ భారతీయ సెలెక్షన్ కమిటీపై ఫైర్ అయ్యాడు.
వన్డే మ్యాచ్ ఆడేంత అనుభవం ఇంకా అతడికి రాలేదని ఈ సమయంలో అతడు సఫారీ బౌలర్లను ఎలా ఎదుర్కోగడంటూ ప్రశ్నించాడు. కేవలం ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్ లలో రాణించినంత మాత్రాన జాతీయ జట్టుకు ఎలా ఎంపిక చేస్తారంటూ నిలదీశాడు.
అయ్యర్ ఆశించిన మేర పర్ ఫార్మెన్స్ కనబర్చక పోగా టీమిండియా గెలుపు అవకాశాలను పూర్తిగా మార్చేశాడంటూ మండిపడ్డాడు గంభీర్(Gautam Gambhir).
మొత్తంగా వెంకటేశ్ అయ్యర్ కు అంత సీన్ లేదని పేర్కొన్నాడు. తాను అతడి ఆట తీరును పూర్తిగా గమనించానని అతడికి వన్డే మ్యాచ్ సరిపోదని తేలిందని స్పష్టం చేశాడు లక్నో మెంటార్.
అయ్యర్ ను వెంటనే తప్పించాలని సూచించాడు. అంతగా బీసీసీఐకి, సెలెక్టర్ చైర్మన్ చేతన్ శర్మకు ప్రేమ ఉంటే టీ20 చాన్స్ ఇచ్చి చూడాలని ఎద్దేవా చేశాడు.
ఇక తాత్కాలిక స్కిప్పర్ గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ అతడిని వాడు కోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు గౌతం గంభీర్.
Also Read : టీ20 సీరీస్ కు వార్నర్..మార్ష్ దూరం