Gemini Edibles MD : జెమిని ఎడిబుల్స్ తెలంగాణలో పెట్టుబడి
రూ. 400 కోట్లతో ఏర్పాటు చేస్తామని వెల్లడి
Gemini Edibles MD : తెలంగాణలో భారీ పెట్టుబడికి శ్రీకారం చుట్టింది జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్. ఈమేరకు రూ. 400 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది.
ఈ కంపెనీ గోల్డెన్ అగ్రి ఇంటర్నేషనల్ (జీఏఆర్) సింగపూర్ జాయింట్ వెంచర్, ఫ్రీడమ్ బ్రాండ్ కింద ఎడిబుల్ పేరుతో నిత్యం ఉపయోగించే వంట, ఇతర ఆయిల్స్ ను తయారు చేస్తుంది. ఇప్పటికే టాప్ లో కొనసాగుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ సమీపంలో ఒక ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీని ఏర్పాటు చేయనుంది.
ఈ సందర్భంగా జెమినీ ఎడిబుల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌదరి(Gemini Edibles MD) హైదరాబాద్ లో తెలంగాణ పరిశ్రమల, పురపాలిక, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుతో సమావేశం అయ్యారు. ఇందులో భాగంగా తమ కంపెనీ తరపున రూ. 400 ఇన్వెస్ట్ చేసేందుకు రెడీగా ఉన్నామని స్పష్టం చేశారు. భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన ఎండీ ప్రదీప్ చౌదరిని ప్రత్యేకంగా అభినందించారు మంత్రి కేటీఆర్.
తెలంగాణ ప్రభుత్వం జెమిని ఎడీబుల్స్ కంపెనీకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రదీప్ చౌదరికి స్పష్టమైన హామీ కూడా ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రెండవ హరిత విప్లవం, గులాబీ విప్లవం, శ్వేత విప్లవం సాధించిందని పేర్కొన్నారు.
20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును లక్ష్యంగా పెట్టుకుందన్నారు కేటీఆర్. తద్వారా పసుపు విప్లవానికి శ్రీకారం చుట్టామన్నారు. తెలంగాణ నుంచి ఎడిబుల్ ఆయిల్ ఉత్పత్తిని పెంచడంలో జెమిని ఎడిబుల్స్ కొత్త పెట్టుబడి కీలక పాత్ర పోషిస్తుందని , స్థానిక రైతులకు కూడా సాయం చేస్తుందని చెప్పారు.
Also Read : ఇన్ఫోర్ డెవలప్‌మెంట్ క్యాంపస్