George Reddy : చైతన్యానికి, పోరాటానికి ప్రతీక జార్జ్ రెడ్డి. ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ హాస్టల్ లో సరిగ్గా ఇదే రోజు ఏప్రిల్ 14న శవమై కనిపించాడు. ఇవాళ ఆయన వర్ధంతి. భావ సారూప్యతలో భేదాలు ఉన్నప్పటికీ నేటికీ జార్జ్ రెడ్డి(George Reddy) వేలాది మందికి స్పూర్తి దాయకంగా ఉన్నాడు. ఆయన చని పోయే నాటికి వయసు కేవలం 25 ఏళ్లు మాత్రమే. భౌతిక శాస్త్రంలో పరిశోధక విద్యార్థిగా ఉన్నాడు. చదువులో టాపర్.
జార్జ్ రెడ్డి స్వస్థలం కేరళ లోని పాలక్కాడ్, 15 జనవరి 1947లో జన్మించాడు. 1962లో వారి కుటుంబం హైదరాబాద్కు మారింది. హైదర్ గూడలోని సెయింట్ పాల్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు. మెడిసన్ లో చేరాలని అనుకున్నాడు. పీయూసీ పరీక్షలో 2వ ర్యాంకు సాధించాడు. రెండో ర్యాంకు వచ్చింది. కానీ మెడికల్ కాలేజీలో సీటు రాలేదు. స్థానికుడు కాక పోవడంతో సీటు రాలేదు. దీంతో బీఎస్సీలో చేరాడు జార్జ్ రెడ్డి.
నిజాం కాలేజీలో బీఎస్సీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. క్రమశిక్షణ, అధికారం , నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నాడు. 1971లో ఎమ్మెస్సీ పూర్తి చేశాడు. తెలివైన విద్యార్థిగా బంగారు పతకాన్ని అందుకున్నాడు. ఎమ్మెస్సీ పూర్తయ్యాక పీహెచ్ డీలో చేరాడు. అతడిని సిఫారసు చేసేందుకు ఏ ప్రొఫెసర్లు ముందుకు రాలేదు. చివరకు ఉస్మానియాలో పరిశోధన చేస్తూనే దోమల్ గూడ లోని ఏవీ కాలేజీలో లెక్చరర్ గా పని చేశాడు. 14 ఏప్రిల్ 1972లో క్యాంపస్ లో శవమై తేలాడు.
ఏబీవీపీ అతడిని మట్టు పెట్టిందని ఆరోపణలు ఉన్నాయి. పీడీఎస్ యూని స్థాపించాడు జార్జి రెడ్డి(George Reddy). వామపక్ష భావాలు కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందాడు. జీనా హైతో మర్నా సీఖో పేరుతో ది లైఫ్ అండ్ టైమ్స్ ఆప్ జార్జ్ రెడ్డి పేరుతో 2016లో గీతా రామస్వామి పుస్తకం రాశాడు. సినిమాలు, డాక్యుమెంటరీలు కూడా వచ్చాయి. మొత్తంగా ఆయన అభిమానులు నేటికీ నీ మరణం వృధా కాదు అంటారు.
Also Read : అంబేద్కర్ ఆలోచనలు స్పూర్తి కిరణాలు