FIFA World Cup 2022 : జ‌ర్మ‌నీ..ఉరుగ్వే ఇంటిబాట‌

నాకౌట్ కు చేరుకోని వైనం..ఫ్యాన్స్ కు బిగ్ షాక్

FIFA World Cup 2022 : ఖ‌తార్ వేదిక‌గా జ‌రుగుతున్న ఫిఫా 2022 వ‌ర‌ల్డ్ క‌ప్ లో(FIFA World Cup 2022) ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే సౌదీ అరేబియా అద్భుతం సాధించింది. మ‌రో వైపు ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో 20 ఏళ్ల త‌ర్వాత జ‌పాన్ ఏకంగా నాకౌట్ కు చేరుకుంది. మ‌రో వైపు ఫిఫా టైటిల్ ఫెవ‌రేట్ రేసులో ముందంలో ఉన్న జ‌ర్మ‌నీ..ఉరుగ్వే జ‌ట్లు ఆదిలోనే నిష్క్ర‌మించాయి.

నాకౌట్ కు చేరుకోకుండానే లీగ్ ద‌శ నుంచి త‌ప్పుకున్నాయి. దీంతో ఆయా దేశాల‌లో ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతున్నారు. ఆపై మండిప‌డుతున్నారు. ఆయా దేశాల‌కు చెందిన ఫ్యాన్స్ ను త‌ట్టుకోవ‌డం అత్యంత క‌ష్టంగా మారింది. ఇక ప్రీక్వార్ట‌ర్స్ లో జ‌పాన్ , కొరియా ప్ర‌వేశించ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

ఈ జ‌ట్ల‌తో పాటు స్పెయిన్ , పోర్చుగ‌ల్ కు కూడా షాక్ త‌గిలింది. కాగా ఉరుగ్వే..జ‌ర్మ‌నీ ఆఖ‌రి మ్యాచ్ ల్లో గెలుపొందినా నాకౌట్ కు చేరుకోక పోవ‌డం విశేషం. గోల్స్ చేయడంలో చోటు చేసుకున్న తేడాలే కొంప ముంచాయి ఇరు జ‌ట్ల‌ను. ఎలాంటి అంచ‌నాలు లేకుండా బ‌రిలోకి దిగిన జ‌పాన్ స్పెయిన్ ను 2-1 తేడాతో గెలుపొంది షాక్ ఇస్తే పోర్చుగ‌ల్ ను కొరియా మ‌ట్టి క‌రిపించింది.

ఇవాల్టి నుంచి ప్రిక్వార్ట‌ర్స్ మ్యాచ్ లు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మార‌నున్నాయి. ఇక జ‌ర్మ‌నీ కొస్టారికాతో జ‌రిగిన మ్యాచ్ లో 4-2 తేడాతో గెలుపొందింది. ఉరుగ్వే ఘ‌నాపై 2-0 తేడాతో ఓడించినా ఫ‌లితం లేకుండా పోయింది.

ఆయా మ్యాచ్ ల‌లో ఇరు జ‌ట్లు గెలుపొందినా గోల్స్ చేయ‌డంలో తేడా రావ‌డం శాపంగా మారింది.

Also Read : స్పెయిన్ ప‌రేషాన్ జ‌పాన్ సెన్సేష‌న్

Leave A Reply

Your Email Id will not be published!