Ghulam Nabi Azad Comment : ‘ఆజాద్’ చూపు ఎటు వైపు
కాషాయమా కొత్త పార్టీనా
Ghulam Nabi Azad Comment : 134 ఏళ్లు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న సీనియర్లంతా ఒక్కరొక్కరుగా వీడుతున్నారు.
పార్టీలో 50 ఏళ్లకు పైగా అనుబంధం కలిగిన, ట్రబుల్ షూటర్ గా పేరొందిన గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad) తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఎన్నో పదవులు చేపట్టారు.
పార్టీకి కీలకమైన నాయకుడిగా ఎదిగారు. దేశ వ్యాప్తంగా రాజకీయాలలో తనదైన ముద్ర కనబర్చారు. గత కొంత కాలం నుంచీ పార్టీలోనే అసమ్మతి స్వరం వినిపిస్తూ వస్తున్నారు.
బలమైన నేతగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఎన్నో క్లిష్ట సమయాలలో పార్టీకి అండగా ఉంటూ వచ్చారు. ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఎంట్రీ ఇచ్చారో
ఆనాటి నుంచీ సీనియర్ నాయకులకు ప్రాధాన్యత లేకుండా పోయింది.
దీంతో వారంతా జి23 పేరుతో ఓ గ్రూప్ ను ఏర్పాటు చేశారు. ఈ టీంలో కీలక పాత్ర పోషించారు గులాం నబీ ఆజాద్. సోనియా గాంధీని ప్రశంసిస్తూనే రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు.
ఆయన వల్లనే పార్టీ నాశనమైందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నిర్వాకం కారణంగానే దేశంలో భారతీయ జనతా పార్టీ బలపడిందని మండిపడ్డారు.
దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి రేసులో ఉన్న కొద్ది మంది నాయకులు గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad) కూడా ఒకరు. ప్రతి చోటా, ప్రతి రాష్ట్రంలో
తనకంటూ ఓ స్వంత టీం కూడా కలిగి ఉన్నారు.
ఎన్నో పదవులు చేపట్టిన ఆజాద్ అనూహ్యంగా తప్పు కోవడం చర్చనీయాంశంగా మారింది. సీఎంగా, పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీగా, ఎంపీ, కేంద్ర
మంత్రిగా, పీసీసీ చీఫ్ గా, రాజ్యసభ్య సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారు.
ఆయనకు ఇప్పుడు 73 ఏళ్లు. అర్ధ శతాబ్దానికి పైగా కాంగ్రెస్ బలోపేతానికి తన వంతు కృషి చేశారు. గత మూడు ఏళ్లకు పైగా ఆజాద్ అసమ్మతి రాగాన్ని ఆలాపిస్తూ వస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన వీడుతారని అనుకోలేదు. 1973లో 22 ఏళ్ల వయస్సులో తన పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేశాడు. జమ్మూ కాశ్మీర్ ప్రెసిడెంట్ గా, 1980లో యూత్ కాంగ్రెస్ చీఫ్ గా పని చేశాడు.
మహారాష్ట్ర వాసిం లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికై తన ప్రస్థానాన్ని అంచెలంచెలుగా విస్తరించుకుంటూ వెళ్లారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ,
పీవీ నరసింహారావు, డాక్టర్ మన్మోహన్ సింగ్ నలుగురు ప్రధానుల హయాంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఆయనకుంది.
మోదీ(PM Modi) ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది. తనను ఎవరో ఒకరు గుర్తించారంటూ ఆజాద్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
ఏది ఏమైనా ఆజాద్ ప్రభావం పార్టీపై పడనుంది. మరి కొత్త పార్టీ పెడతారా లేక బీజేపీలో చేరుతారా అన్నది తేలాల్సి ఉంది.
Also Read : రూ.5,500 కోట్లతో 277 ఎమ్మెల్యేల కొనుగోలు