Giri Babu : గిరిబాబుకు జీవిత సాఫల్య పురస్కారం
సత్కరించిన సాక్షి యాజమాన్యం
Giri Babu : తెలుగు సినిమా రంగంలో వైవిధ్యమైన నటుడిగా పేరొందిన గిరిబాబు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. గిరిబాబు పూర్తి పేరు శేషగిరి రావు. టాలీవుడ్ లో మొదట నెగిటివ్ పాత్రలు పోషించడంలో మంచి పేరు తెచ్చుకున్నారు. హీరోగా , విలన్ గా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , నిర్మాత, దర్శకుడిగా బహుముఖ పాత్రలు ధరించారు.
ఆయన తన ప్రతి పనిలో విజయం సాధించి ప్రశంసలు అందుకున్నారు. గిరిబాబు ప్రముఖ నటుడిగా పేరొందారు. ఆయన తనయుడు కూడా అద్భుతమైన హాస్య నటుడిగా పేరొందారు. తన అభిరుచి, స్వయం కృషితో గిరిబాబు ఈ స్థాయికి చేరుకున్నారు.
ఆనాటి ఎన్టీఆర్ నుండి ఏఎన్ఆర్ వరకు నేటి చిరంజీవి నుండి నాగార్జున వరకు మూడు తరాల అగ్ర నటుల చిత్రాలలో విలన్ పాత్రలను పోషించారు. యర్రా శేషగిరిరావు జూన్ 8, 1943లో ప్రకాశం జిల్లా రావినూతల ఊరులో పుట్టారు. గిరిబాబు జీవితం , కృషి నేటి సినీ తరానికి స్పూర్తిదాయకం.
1973లో విడుదలైన జగమే మాయ తో సినీ రంగంలోకి ఎంటర్ అయ్యారు. జయభేరి ఆర్ట్ పిక్చర్ ను ప్రారంభించి తన అభిరుచికి అనుగుణంగా సినిమాలు తీశాడు. దేవతలారా దీవించండి అనే చిత్రాన్ని నిర్మించాడు. ఇదే బ్యానర్ పై 10 సినిమాలు తీశారు గిరిబాబు.
తన ఐదు దశాబ్దాల సినీ జీవితంలో గిరిబాబు అనేక భాషల్లో 600 కు పైగా మూవీస్ లో నటించారు. సాంఘిక, చారిత్రక, పౌరాణిక, జానపద చిత్రాలలో నటించి మెప్పించారు. ఆయన చేసిన సేవలకు జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు.
Also Read : పూనమ్ రాహుల్ చెట్టాపట్టాల్