Super Striker Maxwell : మాక్స్ వెల్ సూపర్ స్ట్రైకర్ విన్నర్
టాటా టియాగో కారు బహుమతి
Super Striker Maxwell : ఐపీఎల్ ముగిసింది. చెన్నై విజేతగా నిలిచింది. టోర్నీలో గెలుపొందిన ధోనీ సేనకు ప్రైజ్ మనీ కింద రూ. 20 కోట్లు దక్కాయి. ఇక రన్నర్ అప్ గా నిలిచిన గుజరాత్ టైటాన్ కు రూ. 12. 75 కోట్లు లభించాయి. అత్యుత్తమ ఆటగాళ్లుగా బ్యాటర్లలో శుభ్ మన్ గిల్ నిలిస్తే బౌలింగ్ పరంగా షమీకి లభించింది. ఇద్దరికీ ప్రైజ్ మనీ కింద చెరో రూ. 10 లక్షలు అందజేశారు.
ఇక టోర్నీలో సూపర్ స్ట్రైకర్ అవార్డు దక్కింది గ్లెన్ మాక్స్ వెల్(Maxwell) కు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మనోడు 14 ఇన్సింగ్ లు ఆడాడు. 400 రన్స్ చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ ఏకంగా 183.48 . కోహ్లీ టీమ్ మేట్ కు భారీ గిఫ్ట్ దక్కింది. సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకునే ప్లేయర్ కు రూ.10 లక్షలు లేదా టాటా టియాగో ఎలక్ట్రిసిటీ కారు బహుమతిగా ఇచ్చింది ఐపీఎల్. ఎందుకంటే ఐపీఎల్ సీజన్ ను టాటా కంపెనీ స్పాన్సర్ చేస్తోంది.
సూపర్ స్ట్రైకర్ అవార్డు కింద టాటా కారును ఆర్సీబీ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ అందుకున్నాడు. మొత్తంగా కోట్లు కుమ్మరించింది బీసీసీఐ ఐపీఎల్ కోసం. అదే సమయంలో వేల కోట్ల రూపాయల వ్యాపారం ఐపీఎల్ పేరుతో కొనసాగుతోంది. మొత్తంగా 2 నెలల పాటు కొనసాగిన క్రికెట్ పండుగ ఎట్టకేలకు ముగిసింది.
Also Read : Emerging Player Jaiswal