Rohan Khaunte : టీ హబ్ తో గోవా సర్కార్ ఒప్పందం
వెల్లడించిన మంత్రి రోహన్ ఖౌంతే
Rohan Khaunte : ఐటీ పరంగా దేశంలో టాప్ లో కొనసాగుతోంది తెలంగాణ. హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ పరంగా వినుతికెక్కింది. ఇన్నోవేషన్స్ లో , టెక్నాలజీని అంది పుచ్చుకోవడంలో ముందంజలో ఉంది.
ఇప్పటికే ఐటీ, లాజిస్టిక్, ఇతర రంగాలలో హైదరాబాద్ బెటర్ సిటీగా భావిస్తున్నారు పారిశ్రామికవేత్తలు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐటీ సెక్టార్ కు అధిక ప్రయారిటీ ఇస్తూ వస్తోంది.
ప్రత్యేకించి బడా బాబులకు, పారిశ్రామికవేత్తలకు తాయిలాలు ఇవ్వడం, ఎర్ర తివాచీలు పర్చడం, ఉచితంగా విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి.
ఇదే సమయంలో పరిశ్రమల ఏర్పాటు కోసం నూతన పారిశ్రామిక పాలసీని తీసుకు వచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు వీలు కల్పిస్తుంది.
దీనికి పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. ఆ మేరకు వందలాది పరిశ్రమలు ఇక్కడ కొలువు తీరాయి. ఇదే సమయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టి హబ్ , వీ హబ్ ఇతర రాష్ట్రాలను కూడా ఆకర్షించేలా చేస్తున్నాయి.
తాజాగా ఇందుకు సంబంధించి గోవాలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం టి హబ్, వి హబ్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇదే విషయాన్ని ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి రోహన్ ఖౌంతే(Rohan Khaunte) వెల్లడించారు. టాస్క్ ను కూడా గోవాలో ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఐటీ రంగంలో మార్పులు తీసుకు వచ్చేందుకు ఇది దోహద పడుతుందన్నారు.
Also Read : జి20 సదస్సుకు భారత్ ఆతిథ్యం