Saina Nehwal : దేవుని ఆశీస్సులు సిద్దార్థ్ కు ఉండాలి

క్ష‌మాప‌ణ చెప్పిన న‌టుడి స్పంద‌నకు ఓకే

Saina Nehwal  :భార‌త స్టార్ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ సైనా నెహ్వాల్ న‌టుడు సిద్దార్థ్ ల మ‌ధ్య కామెంట్ల క‌ల‌క‌లం దేశాన్ని ఒక్క‌సారిగా కుదిపేసింది. సైనా పంజాబ్ లో ప్ర‌ధాని మోదీకి ఎదురైన సెక్యూరిటీ లోపంపై తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

దీనిపై వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు సిద్దార్థ్ .సామాజిక మాధ్య‌మాల‌లో ఈ కామెంట్స్ మ‌రింత ఉద్రిక్త‌ను పెంచేలా చేశాయి. ఇప్ప‌టికే సిద్దార్ పూర్తిగా మోదీ నాయ‌క‌త్వం, బీజేపీ శ్రేణుల‌కు వ్య‌తిరేకంగా త‌న వాయిస్ వినిపిస్తూ వ‌స్తున్నారు.

ఈ త‌రుణంలో సైనా మోదీకి స‌పోర్ట్ గా నిల‌వ‌డంపై ఫైర్ అయ్యాడు. దీంతో ఏకంగా సైనా నెహ్వాల్ కు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భించింది. ఇంకో వైపు సిద్దార్థ్ ట్రోల్ కు గుర‌య్యాడు.

ఇదే స‌మ‌యంలో కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు తో పాటు జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ స్పందించారు. మ‌హిళ‌ల ప‌ట్ల తీవ్ర జుగుస్సాక‌ర‌మైన రీతిలో కామెంట్స్ చేయ‌డం, ట్వీట్ చేయ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నారు.

పెద్ద ఎత్తున సిద్దార్ పై విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో మ‌నోడు తీవ్ర ఒత్తిడికి లోన‌య్యాడు. చివ‌ర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా స్టార్ ప్లేయ‌ర్ సైనా నెహ్వాల్ (Saina Nehwal )కు క్ష‌మాప‌ణ చెప్పాడు. ఇదే విష‌యాన్ని వెల్ల‌డించాడు.

దీంతో త‌న‌కు తెలియ‌కుండానే తాను ట్విట్ట‌ర్ లో ట్రెండింగ్ కు గురికావ‌డంతో విస్తు పోయాన‌ని సైనా నెహ్వాల్(Saina Nehwal ). త‌న‌కు క్ష‌మాప‌ణ చెప్ప‌డాన్ని స్వాగ‌తించింది.

ఏది ఏమైనా ఇలాంటి వ్యాఖ్య‌లు ఎవ‌రి ప‌ట్లా మంచిది కాద‌ని సూచించింది. త‌ప్పును తెలుసు కోవ‌డం సంతోష‌మ‌ని పేర్కొంది సైనా. ఒక మహిళ ప‌ట్ల ఇలాంటి కామెంట్స్ ఆమోద యోగ్యం కాద‌న్నారు.

ఈ సంద‌ర్భంగా ఆ దేవుని ఆశీస్సులు న‌టుడు సిద్దార్థ్ కు ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపింది సైనా నెహ్వాల్.

Also Read : ద్ర‌విడ్ రికార్డు విరాట్ కోహ్లీ బ్రేక్

Leave A Reply

Your Email Id will not be published!