Goddess Of Law Comment : జూలు విదల్చని న్యాయ వ్యవస్థ
గతి తప్పుతున్న సమాజం
Goddess Of Law Comment : న్యాయ వ్యవస్థ దేశానికి గుండె కాయ లాంటిది. శాసన వ్యవస్థకు న్యాయ వ్యవస్థకు మధ్య ఎల్లప్పుడూ ఘర్షణ వాతావరణం నెలకొంటూనే ఉంటుంది. ప్రత్యేకించి ప్రజాస్వామ్య దేశమైన భారత దేశంలో ఇది మరీ ఎక్కువ. దేశ చరిత్రలో ఎందరో ముఖ్యమంత్రులను, చివరకు ప్రధానిని జైలుకు పంపిన చరిత్ర న్యాయ వ్యవస్థది. కానీ రాను రాను న్యాయ వ్యవస్థ ఏం చేస్తోందంటూ ప్రశ్నలు కలుగుతున్నాయి. కరుడు గట్టిన నేరస్థులు, అక్రమార్కులు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఊరేగుతున్న దగుల్బాజీలు , రౌడీలు, రాజకీయ నాయకులు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత అవుతుంది. చెప్పుకుంటూ పోతే ఓ ఏడాది పాటు సమయం సరిపోదు కూడా. ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో కోట్లాది రూపాయల నల్ల ధనం తెల్ల ధనంగా మారుతోంది.
Goddess Of Law Comment Viral
దీనిపై ఎన్నో పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రత్యేకించి దేశ వ్యవస్థకు మూలాధారమైన ప్రజాస్వామ్యానికి రక్షణ కవచంగా ఉండాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం సైతం అదుపు తప్పిందన్న ఆరోపణలు లేక పోలేదు. దీనికి కారణంగా నేరస్థులను ప్రథమ స్థాయిలోనే కట్టడి చేయక పోవడం దీనికి ప్రధాన కారణం. అంతులేని స్కాంలు, మోసగాళ్లు దర్జాగా ఊరేగుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, చట్టాలలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని విర్రవీగుతున్నారు. వీరికి లాయర్లు, న్యాయవాదులు వత్తాసు పలకడం దారుణం.
భారత దేశ(Bharat) సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ కొలువు తీరాక సంచలన తీర్పులు వెలువడ్డాయి. ప్రత్యేకించి ఆయా కేసుల సందర్బంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన సూచనలు ఒక రకంగా కేంద్ర సర్కార్ కు చెంప పెట్టుగా భావించక తప్పదు. ప్రత్యేకించి జాతీయ మహిళా రెజ్లర్లు రోడ్డుపైకి వచ్చారు. తమను డబ్లుఎఫ్ఐ చీఫ్ లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని నెత్తీ నోరు మొత్తుకున్నా స్పందించిన పాపాన పోలేదు మోదీ(Modi) సర్కార్. చివరకు సీజేఐ జోక్యం చేసుకుంటే కానీ కేసు నమోదు చేయలేదు.
ఇక ఆదరా బాదరగా చీఫ్ ఎన్నికల అధికారి నియామకం విషయంలో కూడా తొందరపాటు చర్యను ప్రశ్నించింది న్యాయ వ్యవస్థ. ఇంకా ప్రశ్నించాల్సినవి, నిగ్గు తేల్చాల్సిన కేసులు లెక్కకు మించి ఉన్నాయి. వీటిపై కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకవేళ న్యాయ వ్యవస్థ గనుక పూర్తి స్థాయిలో విచారణ జరిపితే, సరైన రీతిలో స్పందించి తీర్పులు గనుక వెలువరిస్తే ఈ దేశంలో జైళ్లు సరి పోవు. నేరస్తులు, పొలిటికల్ లీడర్లు, అక్రమార్కులు కొన్ని వేల మంది ఉన్నారు. రాజకీయం , నేరమయం కలిసి పోవడం ఒకింత సమాజానికి పెను ముప్పుగా భావించక తప్పదు. ఇకనైనా న్యాయ వ్యవస్థ జూలు విదిల్చాల్సిన అవసరం ఉంది. కేసులు , నేర చరిత్ర, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా చేస్తే కొంతలో కొంత మేరకు కంట్రోల్ లోకి వస్తుందని జనం భావిస్తున్నారు.
Also Read : Eatala Rajender : గజ్వేల్ పై ఈటల గురి