CWG WC 2022 : భార‌త మ‌హిళా జ‌ట్టుకు తీపి క‌బురు

కోలుకున్న క్రికెట‌ర్ స‌బ్బినేని మేఘ‌న

CWG WC 2022 : చాలా కాలం త‌ర్వాత భార‌త మ‌హిళా జ‌ట్టు కామ‌న్వెల్త్ గేమ్స్ – 2022లో పాల్గొన‌బోతోంది(CWG WC 2022). గ‌తంలో క్రికెట్ కోసం ఎక్కువ టైం ప‌డుతుంద‌నే కార‌ణంతో ప‌క్క‌న పెట్టారు.

కానీ రాను రాను ఇప్పుడు ప్ర‌పంచాన్ని క్రికెట్ అత్యంత ప్ర‌భావితం చేస్తోంది. ప్ర‌త్యేకించి టి20 ఫార్మాట్ దుమ్ము రేపుతోంది.

దీనికి శ్రీ‌కారం చుట్టింది మొద‌ట వ‌ర‌ల్డ్ లో భార‌త్ . బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న ల‌లిత్ మోదీ ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను స్టార్ట్ చేశాడు. ఆనాడు ప్రారంభించిన ఐపీఎల్ ఇప్పుడు వ‌ర‌ల్డ్ ను ఊపేస్తోంది.

ఊగించేలా చేస్తోంది. కోట్లాది రూపాయ‌లు కురిపించేలా చేస్తోంది. కేవ‌లం ఫుట్ బాల్, టెన్నిస్ , వాలీబాల్ , హ్యాండ్ బాల్ మాత్ర‌మే ఇష్ట‌ప‌డే అమెరికాలో సైతం ఇప్పుడు క్రికెట్ ఫీవ‌ర్ పెరిగింది.

ఈ త‌రుణంలో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో కామ‌న్వెల్త్ గేమ్స్ లో ఈసారి క్రికెట్ ను ప్ర‌వేశ పెట్టారు. ప్ర‌స్తుతానికి విమెన్స్ టీమ్ కి చాన్స్ ఇచ్చారు. ఇక భార‌త జ‌ట్టు మొద‌టి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడ‌నుంది భార‌త జ‌ట్టు.

తాజాగా తొలి మ్యాచ్ కి ముందు భార‌త జ‌ట్టు(CWG WC 2022) లోని స‌బ్బినేని మేఘ‌న‌కు టెస్టుల్లో కోవిడ్ తేలింది. చికిత్స అనంత‌రం ఇవాళ జ‌రిపిన టెస్టుల్లో కోలుకుంది. ఆమెకు నెగ‌టివ్ అని వెల్ల‌డైంది.

జ‌ట్టులో చేరేందుకు రెడీ అయ్యింది. ఈ టోర్నీలో ఎనిమిది జ‌ట్లు ఆడ‌తాయి. గ్రూపులుగా విడ‌దీశారు. ఆసిస్, పాకిస్తాన్ , భార‌త్ గ్రూప్ – ఎలో ఉంది. గ్రూప్ -బిలో ఇంగ్లండ్ , ద‌క్షిణా ఫ్రికా, న్యూజిలాండ్ , శ్రీ‌లంక ఉన్నాయి.

ఆయా గ్రూప్స్ లో మొద‌టి రెండు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు సెమీస్ కి చేరుకుంటాయి.

Also Read : ‘జ్యోతి’ అందుకున్న పీఎం..సీఎం

Leave A Reply

Your Email Id will not be published!