Google CEO Kohli : పోరాట పటిమ సూపర్ – సుందర్ పిచాయ్
పాక్ అభిమానికి గూగుల్ సిఇఓ షాక్
Google CEO Kohli : ప్రముఖ ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్(Google CEO) కి క్రికెట్ అంటే తెగ పిచ్చి. మ్యాచ్ జరుగుతుందంటే చాలు ఆయన పనులన్నీ విడిచి పెట్టేస్తారు. ప్రధానంగా భారత జట్టు ఆడుతున్నప్పుడు ఆయన కళ్లన్నీ కంప్యూటర్ మీదకంటే ఆటపై ఉంటుంది.
అంతలా పిచాయ్ కి అభిమానం. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో సూపర్ 12 లీగ్ మ్యాచ్ లో భారత, పాకిస్తాన్ జట్ల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగింది. చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ తరుణంలో టీమిండియా సూపర్ పర్ ఫార్మ్ తో ఘన విజయాన్ని నమోదు చేసింది.
ఈ సందర్భంగా గూగుల్ సిఇఓ భారత జట్టు సాధించిన గెలుపును ప్రశంసించారు. ప్రధానంగా భారత బౌలర్లతో పాటు విరాట్ కోహ్లీ(Virat Kohli) అసమాన ప్రదర్శనను కొనియాడారు. దీనిపై ఓ పాకిస్తాన్ అభిమాని తప్పు పట్టాడు. మీరు మొదటి మూడు ఓవర్లు చూశారా. భారత జట్టును పాకిస్తాన్ బౌలర్లు గడగడ లాడించారు అప్పటికే వికెట్లను కూల్చారంటూ సదరు ఫ్యాన్ పేర్కొన్నాడు.
దీనికి దిమ్మ తిరిగేలా సమాధానం ఇచ్చాడు. నీవు చెప్పింది ఓకే..కానీ భారత జట్టు మొదటి మూడు ఓవర్లు నువ్వు చూసి ఉంటే ఇలా అని ఉండేవాడివి కాదంటూ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు. దీంతో సదరు పాకిస్తాన్ అభిమాని మౌనంగా ఊరుకున్నాడు.
సో మొత్తంగా గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ ఇవాళ జరిగిన మ్యాచ్ ను తాను ఎన్నటికీ మరిచి పోలేనంటూ పేర్కొన్నాడు. వాట్ ఏ విక్టరీ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు ట్విట్టర్ వేదికగా.
Also Read : మహీంద్రా ట్వీట్ ‘లుంగీ డ్యాన్స్’ వైరల్