Gotabaya Rajapaksa : గ్రీన్ కార్డు కోసం ‘గోటబయ’ దరఖాస్తు
ఇక అమెరికాలో స్థిర పడేందుకు ముందస్తు ప్లాన్
Gotabaya Rajapaksa : నిన్నటి దాకా శ్రీలంకకు చీఫ్ గా ఉన్న గోటబయ రాజపక్సే ఉన్నట్టుండి ప్రజల వ్యతిరేకత దెబ్బకు రాజభవనం విడిచి పెట్టి పారి పోయాడు. మొదటి మాల్దీవులకు వెళ్లాడు.
అక్కడ కూడా తనపై దాడి జరుగుతుందన్న భయంతో సింగపూర్ కు వెళ్లాడు. తాజాగా శ్రీలంకకు ఇప్పుడున్న పరిస్థితుల్లో వెళ్లేందుకు దారి లేదు.
దీంతో ప్రపంచంలో అత్యంత సురక్షిత ప్రాంతంగా తనకు అనువైనదిగా ఉంటుందని అమెరికాను ఎంచుకున్నాడు శ్రీలంక దేశ మాజీ అధ్యక్షుడు. దేశాన్ని సర్వ నాశనం చేసి, అప్పుల కుప్పగా మార్చేసిన గోటబయ ను దేశ బహిష్కరణ చేయాలని ప్రజలు పిలుపునిచ్చారు.
మరో వైపు తన సోదరుడు మహీంద రాజపక్సే ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఆర్మీ క్యాంపులో తలదాచుకున్నాడు. తాజాగా అందిన సమాచారం మేరకు గోటబయ రాజపక్సే(Gotabaya Rajapaksa) తన పరివారంతో అమెరికాలో స్థిరపడాలని అనుకుంటున్నారు.
ఇందు కోసం గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2019లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు గోటబయ రాజపక్సే తన అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నారు.
73 ఏళ్ల వయస్సు కలిగిన గోటబయ ప్రస్తుతం తన భార్యతో కలిసి బ్యాంకాక్ లోని ఓ హోటల్ లో ఉన్నారు. నవంబర్ వరకు థాయ్ లాండ్ లో ఉంటారని సమాచారం.
శ్రీలంకకు చెందిన డైలీ మిర్రర్ యుఎస్ లోని రాజపక్సే న్యాయవాదులు అతని భార్య లోమా రాజపక్స యుఎస్ లో ఉన్నందు వల్ల దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని, గ్రీన్ కార్డ్ పొందేందుకు దరఖాస్తు కోసం ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించారని వెల్లడించింది.
Also Read : తైవాన్ తో అమెరికా వాణిజ్య చర్చలు