#AmritShops : అందుబాటులో అమృత్ దుకాణాలు

ప్రైవేట్ మెడిక‌ల్ షాప్‌ల‌కు చెక్

Amrit Shops  : ప్రభుత్వ అధీనంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇక నుంచి తక్కువ ధరల్లో మందులు అందుబాటులోకి రానున్నాయి. సర్కారు దవాఖాన్లలో ‘అమృత్‌‌‌‌’ పేరుతో మెడికల్ షాపులు ప్రారంభం కానున్నాయి. జనరిక్‌‌‌‌ మెడిసిన్‌‌‌‌తో పాటు బ్రాండెడ్ మందులు, సర్జికల్స్‌‌‌‌, ఇంప్లాంట్స్ సహా అన్ని ఐటమ్స్‌‌‌‌ ఈ షాపుల్లో లభించనున్నాయి. ఇందు కోసం హిందుస్థాన్ లేటెక్స్ లిమిటెడ్‌‌‌‌ తో తెలంగాణ ప్రభుత్వం ఇది వరకే ఒప్పందం చేసుకుంది. దీన్‌‌‌‌ దయాల్‌‌‌‌ అమృత్‌‌‌‌ పేరిట కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాల్లో మెడికల్ షాపులు ఏర్పాటు చేస్తోంది. దవాఖాన్లలో రాష్ట్ర‌ ప్రభుత్వం స్థలం కేటాయిస్తే, ఈ సంస్థ షాపులు పెట్టి డిస్కౌంట్‌‌‌‌పై మెడిసిన్ అమ్ముతుంది.

హెచ్ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌ సంస్థ సొంతంగా కొన్ని మెడిసిన్స్ తయారు చేస్తుండగా, మిగతా వాటిని కంపెనీల నుంచి బల్క్‌‌‌‌లో కొనుగోలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో తక్కువ లాభం చూసుకుని, ప్రజలకు అందుబాటులో ధరలో మందులు అందిస్తామని సంస్థ చెబుతోంది. బయటి షాపుల్లో కంటే 30 నుంచి 40 శాతం తక్కువకు అమృత్ షాపుల్లో మందులు దొరుకుతాయి. దీంతో మందుల నిలువు దోపిడీ నుంచి పేదలకు కొంత ఉపశమనం లభిస్తుంది.జనరిక్ మెడిసిన్‌‌‌‌కు ఆదరణ లేకపోవడం, షాపుల నిర్వహణ వర్కవుట్ కాక పోవడంతో బ్రాండెడ్ మెడిసిన్ కూడా అమ్మాలని నిర్ణయించారు.

కొన్ని దవాఖాన్లలో ఇప్పటికే స్థల కేటాయింపు పూర్తవగా, 15 దవాఖాన్లలో షాపులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని టీచింగ్‌‌‌‌ హాస్పిటళ్లు, జిల్లా హాస్పిటళ్లు, ఏరియా హాస్పిటళ్లలో ఈ షాపులు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కొన్ని సర్కారు దవాఖాన్లలో ప్రైవేటు మెడికల్ షాపులు దందా సాగిస్తున్నాయి. రోజూ లక్షల్లో వ్యాపారం జరుగుతున్నట్లు ఆరోగ్య శాఖా అధికారులు గుర్తించారు. జనరిక్ మెడిసిన్ షాపులకు మాత్రమే అనుమతి  ఇవ్వాలని పదేండ్ల కిందట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా, అది ఎక్కడా అమలు కావడం లేదు.

No comment allowed please