Governor KCR : ప్రార్థనా మందిరాలు ప్రారంభం
పాల్గొన్న గవర్నర్ తమిళి సై ..సీఎం కేసీఆర్
Governor KCR : తెలంగాణ సచివాలయం ఆవరణలో పునర్ నిర్మించిన ప్రార్థనా మందిరాలు గుడి..చర్చి..మసీదులను శుక్రవారం గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ , సీఎం కేసీఆర్ ప్రారంభించారు. నిజమైన సెక్యులరిజానికి ప్రతీకగా నిలిచింది.
Governor KCR Inaugurated New Church, Masjid, Temple
దీనిని పనిగట్టుకుని సీఎం కేసీఆర్ పునర్ నిర్మించేలా చేశారు. అత్యంత ఆధునికమైన టెక్నాలజీతో సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. మత సామరస్యానికి ప్రతీకగా కలకాలం నిలిచేలా కృషి చేశారు. హిందూ , క్రైస్తవ, ముస్లిం మతాలకు చెందిన మూడు ప్రార్థనా మందిరాలు ఒకే రోజు వరుసగా ప్రారంభించడం విశేషం.
అంతకు ముందు సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్(Tamilisai Soundarajan) కు ఘనంగా స్వాగతం పలికారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నల్ల పోచమ్మ ఆలయాన్ని ప్రారంభించారు. ఇందులో ఉన్న శివాలయం, ఆంజనేయ స్వామి మందిరాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం గవర్నర్ , కేసీఆర్ చర్చిని ప్రారంభించారు. కేక్ కట్ చేసి ఫాదర్స్ కు ఇచ్చారు. ఆ పక్కనే నిర్మించిన మసీదు వద్దకు చేరుకున్నారు. సంప్రదాయ పద్దతిలో గవర్నర్ తమిళి సైకి, సీఎం కేసీఆర్ కు మత పెద్దలు స్వాగతం పలికారు.
Also Read : CM KCR : సీఎం కేసీఆర్ ఖుష్ కబర్