R Praggnanandhaa Comment : ఈ చిచ్చ‌ర పిడుగు చెస్ లో కింగ్

ఎవ‌రీ ప్ర‌జ్ఞానంద ఏమిటా క‌థ

R Praggnanandhaa Comment : ఈ దేశం యువ‌త ఆత్మ‌లో బ‌తుకుతోంది. వాళ్లే రేప‌టి భ‌విష్య‌త్తుకు ఆశా దీపాలు. వాళ్ల‌పై నాకు అపార‌మైన న‌మ్మ‌కం ఉంది. ఏదో ఒక రోజు ప్ర‌పంచానికి మార్గ‌ద‌ర్శ‌కంగా , దిక్సూచీలుగా మార‌తారన్న స్వామి వివేకానంద, ఏపీజే అబ్దుల్ క‌లాం అన్న మాట‌లు అక్ష‌ర స‌త్యాలు చేస్తున్నారు.

R Praggnanandhaa Comment Viral

కొంద‌రు విలువైన స‌మ‌యాన్ని సోష‌ల్ మీడియాపై ఫోక‌స్ పెడుతుంటే, దుర‌ల‌వాట్ల‌కు లోన‌వుతుంటే ఇంకొంద‌రు యువ‌త మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నారు. త‌మ‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఉండేలా కృషి చేస్తున్నారు. ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఆద‌ర్శ ప్రాయంగా మారుతున్నారు.

అలాంటి వారిలో నిండా 19 ఏళ్లు కూడా నిండ‌ని త‌మిళ‌నాడు రాష్ట్రంలోని చెన్నైకి చెందిన ఆర్. ప్ర‌జ్ఞానంద ఒక‌రు. అతిర‌థ మ‌హార‌థులకే ప‌జిల్ లాంటిది చ‌ద‌రంగం. దానిలో రాణించాలంటే మెద‌డు 24 గంట‌లు పని చేయాలి. ఫుల్ ఫోక‌స్ పెట్టాలి. ఒక్కోసారి చిక్కిన‌ట్టే అనిపిస్తాయి. కానీ ఏదీ అంద‌దు.

త‌ను కూడా అంద‌రి లాగే క‌ల‌లు క‌న్నాడు ప్ర‌జ్ఞానంద‌. అందు కోసం అహోరాత్రులు శ్ర‌మించాడు. త‌ను అనుకున్న‌ది సాధించాడు. అయితే ఏదో ఒక రోజు ప్ర‌పంచ చెస్ ఛాంపియ‌న్ కావాల‌న్న‌ది అత‌డి శాశ్వ‌త‌మైన క‌ల‌. అది సాధించేంత వ‌ర‌కు తాను నిద్ర పోనంటున్నాడు ఈ చిన్నోడు.

చెస్ ఛాంపియ‌న్ షిప్ పోటీలో రన్న‌ర‌ప్ గా నిలిచాడు ప్ర‌జ్ఞానంద‌(R Praggnandhaa). అసాధ‌ర‌ణ‌మైన ప్ర‌తిభ‌. అంతులేని విజ్ఞానం. తెలుసు కోవాల‌న్న త‌ప‌న‌. అంత‌కు మించిన విన‌యం. ఇదీ అత‌డికి ఉన్న ప్ర‌త్యేక‌త‌. యావ‌త్ ప్ర‌పంచం అత‌డి తెలివిని , ప్ర‌ద‌ర్శించిన పోటీని చూసి నివ్వెర పోయింది.

ప్ర‌జ్ఞానంద(R Praggnandhaa) ఆగ‌స్టు 10, 2005లో పుట్టాడు. రెండు సంవ‌త్స‌రాల నుంచే చెస్ అంటే మ‌క్కువ క‌ల‌గ‌డం మామూలు మాట‌లు కాదు. త‌న సిస్ట‌ర్ వైశాలి స్పూర్తితో 2018లో గ్రాండ్ మాస్ట‌ర్ టైటిల్ సాధించాడు. 2021లో ఇంట‌ర్నేష‌న‌ల్ మాస్ట‌ర్ గా నిలిచాడు ప్ర‌జ్ఞానంద‌.

ఆరు సంవ‌త్స‌రాల వ‌య‌సు ఉన్న‌ప్పుడు అండ‌ర్ -7 ఇండియ‌న్ ఛాంపియ‌న్ షిప్ లో 2వ స్థానంలో నిలిచాడు. ఆసియా చెస్ ఛాంపియ‌న్ షిప్ లో బంగారు ప‌త‌కం పొందాడు. అండ‌ర్ -8, అండ‌ర్ -10 ల‌లో ప్రపంచ యూత్ చెస్ విజేత‌గా నిలిచాడు ప్ర‌జ్ఞానంద‌. 12 ఏళ్ల వ‌య‌స్సులో గ్రాండ్ మాస్ట‌ర్ టైటిల్ ను సాధించాడు. అండ‌ర్ -18 విభాగంతో యూత్ ఛాంపియ‌న్ లో అద్భుత ప్ర‌తిభ‌తో ప్రపంచాన్ని ఆక‌ర్షించాడు.

ఈ ఏడాదిలో చెస్ ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్ కు చేరుకున్న అత్యంత పిన్న వ‌య‌సు క‌లిగిన క్రీడాకారుడిగా చ‌రిత్ర సృష్టించాడు. ప్ర‌స్తుతం ర‌న్న‌రప్ గా నిలిచినా రాబోయే కాలంలో త‌ప్ప‌కుండా విశ్వ విజేత అవుతానంటున్నాడు ప్ర‌జ్ఞానంద‌. అత‌డు సాధించిన విజ‌యానికి యావ‌త్ భార‌తం అభినంద‌న‌లు తెలుపుతోంది.

Also Read : Governor KCR : ప్రార్థ‌నా మందిరాలు ప్రారంభం

Leave A Reply

Your Email Id will not be published!