Goa CM : ప్రైవేట్ లో ప‌ని చేస్తేనే ప్ర‌భుత్వ ఉద్యోగం – సీఎం

గోవా బీజేపీ సీఎం వితండ వాదం

Goa CM : ఆయ‌న బాధ్య‌త క‌లిగిన ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్నారు. దేశంలో బీజేపీ ప్ర‌భుత్వం కొలువు తీరాక విచిత్ర‌క‌ర‌మైన ధోర‌ణ‌లు, కామెంట్స్ , దూష‌ణ‌లతో అట్టుడుకుతోంది. తాజాగా గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్(Goa CM) చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. విప‌క్షాలు ఆయ‌నకు సోయి లేకుండా పోయిందంటూ మండిప‌డుతున్నాయి.

విచిత్రం ఏమిటంటే అటు పీఎం వ్యాపార‌వేత్త‌ల‌కు వ‌త్తాసు ప‌లుకుతూ దేశానికి సంబంధించిన వ‌న‌రుల‌ను దోచి పెడుతుంటే ఇక్క‌డ సీఎం మాత్రం తాను జాబ్స్ ఇవ్వాల్సింది పోయి ప్రైవేట్ జ‌పం చేయ‌డం విస్తు పోయేలా చేస్తోంది. రాష్ట్రంలో ఇక నుంచి ఎవ‌రైనా ప్ర‌భుత్వ ఉద్యోగం పొందాలంటే త‌ప్ప‌నిస‌రిగా ప్రైవేట్ సంస్థ‌ల‌లో ఒక ఏడాది పాటు ప‌ని చేయాల్సి ఉండాల‌ని రూల్ పెట్టారు.

ఇందుకు సంబంధించి ప్ర‌భుత్వ‌మే రూల్ పాస్ చేసింది. దీనిపై భ‌గ్గుమంటున్నారు నిరుద్యోగులు, విప‌క్షాలు. ప్ర‌భుత్వానికి నైపుణ్యం ఉన్న వారి అవ‌స‌రం ఉంద‌ని, కానీ నేరుగా ఎంపికైతే వారితో ప‌నులు చేయించు కోలేమ‌ని పేర్కొన్నారు.

అందుకే ఏడాది పాటు ప్రైవేట్ కంపెనీల‌లో ప‌ని చేస్తే వారికి అనుభ‌వం వ‌స్తుంద‌ని త‌ద్వారా రాష్ట్రంలో ప‌నులు సాఫీగా, వేగంగా జ‌రిగేందుకు ఆస్కారం ఏర్ప‌డుతుంద‌న్నారు ప్ర‌మోద్ సావంత్(Goa CM).

క నుంచి ప్రైవేట్ ఉద్యోగ అనుభ‌వం వారికి మాత్ర‌మే స‌ర్కార్ ఉద్యోగం ఇస్తామ‌ని లేక పోతే ఇవ్వ‌బోమంటూ ప్ర‌క‌టించారు సీఎం. రాను రాను ప్ర‌భుత్వాలు పూర్తిగా బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటున్నాయి. ఒక ర‌కంగా చెప్పాలంటే ప్రైవేట్ జ‌పం చేస్తూ కాలం వెళ్ల‌దీస్తున్నాయి. ఇందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ గోవా సీఎం చేసిన వ్యాఖ్య‌లు.

Also Read : మారిన స్వ‌రం మ‌న్మోహ‌న్ అద్భుతం

Leave A Reply

Your Email Id will not be published!