Govt Of India : మీడియా గీత దాటితే జాగ్రత్త
మోదీ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్
Govt Of India : కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ మీడియా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే భారత దేశానికి సంబంధించి కేంద్ర సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా తన స్థాయిని దాటి ముందుకు వెళితే , ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే తీవ్ర చర్యలు తప్పని హెచ్చరించింది.
Govt Of India Warns Media
తాజాగా కెనడాలో ఖలిస్తానీ ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఈ సందర్భంగా పలువురు పంజాబీ గాయకులు సైతం సపోర్ట్ గా నిలవడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. తీవ్రమైన నేరాలు, ఉగ్రవాదం , నిషేధించబడిన సంస్థలకు సంబంధించి ఎలాంటి వార్తలు ప్రచురించినా లేదా ప్రసారం చేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
భారత దేశానికి(India) సంబంధించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా లేదా ఖలిస్తాన్ లాంటి తీవ్రవాద సంస్థలకు వంత పాడినా, అలాంటి వారికి ఛానళ్లలో చోటు కల్పించినా ఒప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ జారీ చేసింది.
రాజ్యాంగం లోని ఆర్టికల్ 19(2) కింద నిర్దేశించబడిన సహేతుకమైన పరిమితులకు సంబంధించి, సీటీఎన్ చట్టం లోని సెక్షన్ 20 లోని సబ్ సెక్షన్ (2) కింద ఉత్తర్వులలో పేర్కొంది కేంద్రం .
Also Read : Rahul Gandhi Comment : రూట్ మార్చిన రాహుల్