MLC Kavitha Harathi : రావమ్మా ఎమ్మెల్సీ కవితమ్మా
హారతి ఇచ్చి స్వాగతం
MLC Kavitha Harathi : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఢిల్లీలోని ఈడీ ఆఫీసు ముందు శనివారం హాజరైంది. ఉదయం 11 గంటల నుండి రాత్రి 8.05 గంటల దాకా విచారణ చేపట్టింది. దాదాపు 9 గంటల పాటు విచారణ చేపట్టింది ఈడీ బృందం. ఆఫీసు లోకి వెళ్లే ముందు పిడికిలి బిగించారు కవిత. అనంతరం బయటకు వచ్చాక చిరునవ్వుతో కారులో కూర్చుకున్నారు.
భారీగా చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులకు , మీడియాకు అభివాదం చేశారు. కేవలం ఈడీ ఆఫీసుకు సీఎం భవన్ కు మధ్య కొద్ది దూరం మాత్రమే ఉండడంతో కొద్ది నిమిషాల లోపే చేరుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున జై కేసీఆర్ జై కవిత అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కవిత తో పాటు భర్త అనిల్ కూడా ఆమె వెంట ఉన్నారు. ఇంట్లోకి వెళ్లే ముందు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు(MLC Kavitha Harathi) బొట్టు పెట్టి హారతి ఇచ్చారు. ఆమె చిరునవ్వుతో ఇంట్లోకి వెళ్లి పోయారు. ఇక ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందనే దానిపై సీఎం కేసీఆర్ కు వివరించారు మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్.
ఇప్పటికే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, శ్రేణులు హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు. మొత్తంగా అరెస్ట్ కథ ఉట్టిదేనని బీఆర్ఎస్ , బీజేపీ రెండూ ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈడీ అరెస్ట్ చేయకుండా ఎందుకు వదిలి పెట్టిందని ప్రశ్నిస్తున్నారు.
Also Read : కేసీఆర్ ఫ్యామిలీపై కక్ష కట్టిన మోదీ